తక్కువ సమయంలోనే సాధించారు

తక్కువ సమయంలోనే సాధించారు

11-11-2017

తక్కువ సమయంలోనే సాధించారు

ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ పదేళ్లు ఉన్నప్పటికీ రైతులు త్యాగం చేసిన మన గడ్డ నుంచి మనమే పరిపాలించాలని, తక్కువ సమయంలో శాసనసభను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన తనయుడు, మంత్రి లోకేష్‌ కృతజ్ఞతలు తెలిపారు. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి లోకేష్‌ తొలిసారిగా శాసనసభలో మాట్లాడుతూ అమరావతిలో సీనియర్‌ నేతల మధ్య ప్రసంగించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. సభ్యులు డేవిడ్‌రాజు అడిగిన ప్రశ్నపై లోకేష్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని 12,918 పంచాయతీల్లో 1307 పంచాయతీలకు సొంత భవనాలు లేవన్నారు. 2004 నుంచి 2014 వరకు కేవలం 472 భవనాలను రూ.10 కోట్లతో కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్మించిందన్నారు.