అమరావతికి అమెరికా చెట్లు!

అమరావతికి అమెరికా చెట్లు!

13-11-2017

అమరావతికి అమెరికా చెట్లు!

నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నందనవనం కావడానికి రంగం సిద్ధమైంది. రాజధాని నగరంపై ఆకుపచ్చని ముద్ర వేయడానికి ప్రభుత్వ ప్రణాళిక ఖారారైంది. హరిత వనాలతో పాటు నీటి వనరుల అనుసంధానికి ఏడీసీ నడుం బిగించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన స్ఫూర్తితో రాజధాని నగరాన్ని నందనవంగా మార్చడానికి అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏడీసీ) గ్రీనింగ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టును ప్రారంభించడానికి సర్వస్నద్ధమైంది. సుమారు రూ.1484 కోట్లు ఖర్చు అంచనాలున్న ఆ ప్రాజెక్టుకు 70శాతం రుణ సాయం కోసం ప్రపంచబ్యాంకును సంప్రదించాలని ఏడీసీ భావిస్తోంది. మూడేళ్లకాల వ్వవధిలో పూర్తి చేయాల్సిన ఈ ప్రాజెక్టు, అమరావతిని ప్రపంచంలోనే గొప్ప హరిత నగరంగా, నీటి వనరులు అనుసంధానమైన రాజధానిగా తయారు చేయడానికి ప్రణాళికను సిద్ధమైంది. ఈ ప్రాజెక్టును ఈ నెల 18న ప్రారంభించే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కేరళలోని తిరువనంతపురం నుంచి టెలికాన్ఫరెన్సును నిర్వహించారు. కార్యచరణ వేగవంతగా చేయాలని ఆదేశించారు.

సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుకు, సెంట్రల్‌ పార్క్‌ చుట్టు ప్రక్కల 7 ప్రముఖ రహదారుల్లో ఇరువైపులా 36వేల చెట్లను పెంచాలని ప్రణాళిక రచించామని తెలిపారు. వీటిలో 24వేల భారీ వృక్షాలుగా ఎదిగేవి కాగా, పూలు పూసే మొక్కలు, చెట్లు  12వేల ఉంటాయని వివరించారు. సీడ్‌ యాక్సెస్‌రోడ్డులో కదంబ వృక్షాలు, బోది వృక్షాలు, మహగని చెట్లు, వేపచెట్లు, కావుకి వృక్షాలు, మర్రిచెట్లు ఉంటాయని తెలిపారు. శాఖమూరు పార్కులో సిల్వర్‌ ట్రంపెల్‌ ట్రీ అనే దక్షిణ అమెరికాకు చెందిన వృక్షాలు, వేపచెట్లు, చంపక వృక్షాలు ఉంటాయని చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌ మాట్లాడుతూ గ్రీన్‌ డెవలెవ్‌మెంట్‌ అనేది నగర నిర్మాణంలో భాగమని అన్నారు. ఆ కారణంగా వరద నియంత్రన పనులకు శ్రీకారం చుడుతున్నామని అన్నారు. నగరంలో ముఖ్యంగా 3 భాగాలుండాలని ఏడీసీ చైర్‌పర్స్‌న్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. జాతీయ రహదారులతో పాటు లోపలి రహదారులపై కూడా చెట్లు ఉండే విధంగా ప్రణాళిక ఉండాలని చెప్పారు. అర్భన్‌ గ్రీన్‌వేలు ఉండడం చాలా ముఖ్యమన్నారు.