సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

13-11-2017

సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా నదిలో జరిగిన పడవ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరువనంతపురంలో ఉన్న ఆయన ప్రమాదం సమాచారం తెలిసిన వెంటనే అక్కడి నుంచే ఫోన్లో విజయవాడలో ఉన్న ఉన్నతాధికారులతో మాట్లాడారు. డీజీపీ, కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, ఇతర ఉన్నతాధికారులు తక్షణం ప్రమాదస్థలికి వెళ్లి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించాలని ఆదేశించారు. అధికారులంతా ప్రమాదస్థలంలోనే ఉండి పర్యవేక్షణ జరపాలని కోరారు. తనకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని సూచించారు.