ఇదంతా చంద్రబాబు ఘనత

ఇదంతా చంద్రబాబు ఘనత

14-11-2017

ఇదంతా చంద్రబాబు ఘనత

ఈ రోజుల్లో భూతద్దం పెట్టి వెతికినా ఎక్కడా కట్టెల పొయ్యి కనిపించదు అందరి ఇళ్లలో గ్యాస్‌ మాత్రమే కనిపిస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఇదంతా టీడీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కిన ఘనత అని అన్నారు. అసెంబ్లీలో పలువురి శాసన సభ్యుల ప్రశ్నలపై మాట్లాడిన ఆయన గ్యాప్‌ పొయ్యి, సిలిండర్లు అన్ని ఇళ్లకూ ఇచ్చాం కానీ భవిష్యత్తులో సిలిండర్లు లేకుండా పైపులైను ద్వారానే ప్రతి ఇంటికి గ్యాస్‌ ఇస్తామంటే ఇది ఏమైనా అమలు జరుగుతుందా? అని ముఖ్యమంత్రి నిర్ణయాన్ని అనుమానించానన్నారు. అయితే కాస్త నిదానంగా ఆలోచించిన తర్వాత ముఖ్యమంత్రి నిర్ణయం సరైనదేనని క్లారిటీ వచ్చిందన్నారు. ఇలా భవిష్యత్తులో పైపులైను వేస్తామనడం ఈ ప్రభుత్వానికి ఎంత దూరదృష్టి ఉందన్నది తెలుస్తోందన్నారు. ఇదంతా ప్రజలు గమనించి అర్థం చేసుకోవాలని అన్నారు. భవిష్యత్తులో ఖచ్చితంగా పైపులైన్ల ద్వారా గ్యాస్‌ కనెక్షను ఇచ్చి తీరుతామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని సభ్యులంతా సంబంధిత నియోజకవర్గాల్లోని ప్రజలకు తెలియపర్చాలని విజ్ఞప్తి చేశారు.