100 కిలో మీటర్లు చేరుకున్న ప్రజా సంకల్పయాత్ర

100 కిలో మీటర్లు చేరుకున్న ప్రజా సంకల్పయాత్ర

14-11-2017

100 కిలో మీటర్లు చేరుకున్న ప్రజా సంకల్పయాత్ర

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 100 కిలోమీటర్ల మైలురాయి చేరింది. కర్నూలు జిల్లా చాగలమర్రి దగ్గర ఆయన పాదయాత్ర 100 కిలో మీటర్లకు చేరుకుంది. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌కు చాగలమర్రి వద్ద గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. పూల వర్షం కురిపించి తమ అభిమానం చాటుకున్నారు. వంద కిలోమీటర్లు పూర్తి చేసిన సందర్భంగా జగన్‌ గొడిగనూరులో పార్టీ జెండాను ఆవిష్కరించారు.