ప్రతి ఒక్కరి కల నెరవేరుస్తాం : చంద్రబాబు

ప్రతి ఒక్కరి కల నెరవేరుస్తాం : చంద్రబాబు

14-11-2017

ప్రతి ఒక్కరి కల నెరవేరుస్తాం : చంద్రబాబు

సొంత ఇల్లు ఉండాలన్నది ప్రతి ఒక్కరి కల అని, ఆ కలను నెరవేర్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అసెంబ్లీలో ఇళ్ల నిర్మాణంపై చర్చ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. విశాఖలో 50వేల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో మరో 15 లక్షల నుంచి 20 లక్షల మందికి ఇంటి స్థలం ఇచ్చి క్రమబద్ధీకరించాల్సి ఉందని తెలిపారు. కాంగ్రెస్‌ పాలనలో 14.40 లక్షల ఇళ్లు కాగితాలకే పరిమితమయ్యాయని, ఇళ్ల నిర్మాణంలో అక్రమాలపై దర్యాప్తు చేయించి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఏడాదికి మూడు సార్లు గృహప్రవేశాల కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. పట్టణాల్లో 5,39,586 ఇళ్లు కడుతున్నామని, గ్రామీణ ప్రాంతాల్లో మరో 13,06,555 ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. ఎన్నికల నాటికి 18,45,841 ఇళ్లు పూర్తి చేయాల్సి ఉందని, 19 లక్షల ఇళ్లు నిర్మించి ఎన్నికలకు వెళ్తామని తెలిపారు.