బసినేపల్లిలో మొదలైన వైయస్ జగన్‌ ప్రజాసంకల్పయాత్ర

బసినేపల్లిలో మొదలైన వైయస్ జగన్‌ ప్రజాసంకల్పయాత్ర

03-12-2017

బసినేపల్లిలో మొదలైన వైయస్ జగన్‌ ప్రజాసంకల్పయాత్ర

వైయస్ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 26వ రోజుకి చేరుకుంది. కడప, కర్నూలు జిల్లాల్లో ముగించుకుని ప్రజాసంకల్పయాత్ర సోమవారం అనంతపురం జిల్లాలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. గుంతకల్ నియోజకవర్గంలోని గుత్తి మండలం బసినేపల్లిలో కాసేపటి క్రితం వైయస్ జగన్ యాత్ర ప్రారంభించారు.  పార్టీ జెండాను ఆవిష్కరించి పాదయాత్రను ముందుకు కొనసాగించనున్నారు. తొలుత గుత్తి ఆర్ఎస్‌కు పాదయాత్ర చేరుకుంటుంది. మధ్యాహ్నం అక్కడే ఆయన భోజన విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతోంది. సాయంత్రం గుత్తిలోని గాంధీ చౌక్‌లో బహిరంగ సమావేశంలో వైఎస్ జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రికి గుత్తిలోనే వైఎస్ జగన్ బస చేస్తారు.

Click here for Photogallery