గుత్తిలో వైయస్ జగన్ ప్రసంగం..

గుత్తిలో వైయస్ జగన్ ప్రసంగం..

04-12-2017

గుత్తిలో వైయస్ జగన్ ప్రసంగం..

రాష్ట్రంలో మోడల్ స్కూల్స్ ను కోట్లాది రూపాయలతో కట్టారని.. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం కూడా సహాయసహకారాలు అందించిందని శ్రీ జగన్ తెలిపారు. గుత్తిలోనూ మోడల్ స్కూల్ ఉందని ఈ మోడల్ స్కూల్ లో ఆరు నెలల నుంచి టీచర్లకు జీతాలు ఇవ్వటంలేదన్నారు. వారు ఎలా బతుకుతారు. పిల్లలకు చదువు ఎలా చెబుతారన్న ఇంగిత జ్ఞానం చంద్రబాబుకు లేదన్నారు. గుత్తిలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు కూడా మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వటంలేదని ఆవేదన వ్యక్తం చేశారన్నారు. ఉర్ధూ స్కూల్ లో పిల్లలకు అన్నం వండించే ఆయాలకు కూడా 6నెలల నుంచి డబ్బులు ఇవ్వటం లేదన్నారు. పిల్లలకు అన్నం వండించటానికి కమ్మలు అమ్మేశారన్నారు. 108 నెంబర్ ఫోన్ చేస్తే కుయ్.. కుయ్.. అంటూ 20 నిమిషాల్లో అంబులెన్స్ వచ్చేదన్నారు. ఆ 108 ఉద్యోగులు వచ్చి రెండు నెలల నుంచి జీతాలు ఇవ్వటంలేదని చెబుతున్నారు. జడ్పీ హైస్కూల్ నుంచి విద్యార్థులు వచ్చి బాత్రూంలు అధ్వాన్నంగా ఉన్నాయని చెబుతున్నారన్నారు. అనంతపురం జిల్లాలో అడుగుపెట్టే లోపు గుత్తికి వచ్చేలోపు దారిపొడవునా ఇవన్నీ మీరు చెప్పిన మాటలే. పాలన అన్యాయమైన పరిస్థితి ఉందన్నారు. పాలన పూర్తిగా తెరమరుగు అయిందన్నారు. పాలనలో విచ్చలవిడి అవినీతి కనిపిస్తోందన్నారు. మట్టి నుంచి ఇసుక దాకా ఏదీ వదలటం లేదు. మద్యం నుంచి కాంట్రాక్టర్ల వరకు, కాంట్రాక్టర్ల నుంచి రాజధాని భూములకు, రాజధాని భూముల నుంచి గుడి భూముల వరకు విచ్చలవిడి అవినీతి ఈ ప్రభుత్వంలో జరుగుతోందన్నారు.

చంద్రబాబు పైన తింటుంటే.. జన్మభూమి కమిటీలు మాఫియాలను బాబు తయారు చేశారన్నారు. గ్రామంలో మరుగుదొడ్లు, పింఛన్లు.. ఇలా ఏపనికైనా అవినీతి జరుగుతోందన్నారు. 4 సంవత్సరాల పాలనలో.. అవినీతే జరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి కావటం కోసం.. బాబు వాగ్ధానాలు ఒక్కసారి గుర్తు చేసుకోండన్నారు. ప్రతి పేదవాడికీ మూడు సెంట్లలో ఇళ్లు కట్టిస్తానని బాబు అన్న సంగతి ఈ సందర్భంగా శ్రీ జగన్ గుర్తు చేశారు. ఇప్పటికి నాలుగేళ్లు అవుతోంది. మీకు ఒక్క ఇళ్లైనా కట్టించారా అని శ్రీ జగన్ ప్రశ్నిస్తే.. లేదని అందరూ చేతులు ఊపారు. బాబు ముఖ్యమంత్రి కాకమునుపు రూ.50, రూ.100లోపు కరెంటు బిల్లు వచ్చేదన్నారు. నాలుగు సంవత్సరాల తర్వాత బాబు వచ్చాక రూ.500 రూ.1500 కరెంటు బిల్లు వస్తోందని శ్రీ జగన్ తెలిపారు.

చంద్రబాబు పాలనలో రేషన్ షాపులో బియ్యం తప్ప ఇతర నిత్యావసర సరుకులు ఏవీ ఇవ్వటం లేదన్నారు. కిరోసిన్, చక్కెర, కందిపప్ప, పామాయిల్, గోధుమ పిండి, పసుపు, కారం, ఉప్పు.. ఇలా 9రకాల వస్తువులు ఇచ్చేవారన్నారు. బాబు ముఖ్యమంత్రి కాకముందు మున్సిపల్ ట్యాక్స్ రూ.50, రూ.60 మాత్రమే వచ్చేదన్నారు. ఇవాళ మున్సిపల్ ట్యాక్స్ రూ.400 పైనే వస్తోందన్నారు. ఎన్నికలప్పుడు జాబు రావాలంటే బాబు రావాలన్నారు. జాబు ఇవ్వకపోతే ఇంటింటికీ రెండు వేలు ఇస్తానని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయి .. 45 నెలలు అయింది. అంటే ప్రతి ఇంటికీ 90వేలు చంద్రబాబు బాకీ పడ్డారన్నారు. బ్యాంకుల్లో బంగారం మీ ఇంటికి రావాలంటే.. బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. వ్యవసాయ రుణాలు పూర్తిగా బేషరుతుగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం మీ ఇంటికి వచ్చిందా అని శ్రీ జగన్ ప్రజానీకాన్ని ప్రశ్నిస్తే.. లేదని చేతులు ఊపారు. బంగారం రాలేదు. వేలం వేస్తున్నట్లు నోటీసులు వస్తున్నాయని అన్నారు. బాబు రుణమాఫీ పథకం వడ్డీలకు కూడా సరిపోవటం లేదన్నారు. పొదుపుసంఘాల అక్కచెల్లెమ్మలను కూడా ఇలాగే బాబు మోసం చేశారని శ్రీ జగన్ తెలిపారు. నాలుగు సంవత్సరాల తర్వాత పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు ఒక్క రూపాయి మాఫీ కాలేదన్నారు. మాఫీ సంగతి దేవుడు ఎరుగు. సున్నా వడ్డీతో వచ్చే వడ్డీలు కూడా ఎగిరిపోయాయన్నారు. ముక్కుపిండి బ్యాంకులు రూపాయిన్నర వడ్డీలు వసూలు చేస్తున్నాయని శ్రీ జగన్ తెలిపారు. వడ్డీలు బ్యాంకులకు ముడితేనే బ్యాంకులు వడ్డీలేని రుణాలు ఇస్తాయన్నారు.

నాలుగు సంవత్సరాల చంద్రబాబు పాలన చూశారన్నారు. ప్రతి కులాన్నీ బాబు మోసం చేశారన్నారు. బాబు చేసిన మోసం అంతా ఇంతా కాదన్నారు. అసెంబ్లీలోనూ.. బాబు మోసం చేశారు. బోయలను ఎస్టీలుగా చేసి కేంద్రానికి పంపించారట. సీఎంఓ నుంచి ఫోన్లు. కేకులు కట్ చేయండి. అందరికీ పంపండని.. ఇది చూస్తుంటే ఆశ్చర్యం. ఇప్పటికే మూడుసార్లు తీర్మాణం జరిగింది. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో బోయల, కురియలు.. అధికారంలోకి వచ్చేస్తే చేసేస్తాం అన్నారు. ఈ రోజు ప్రయత్నిస్తాం.. కేంద్రానికి పంపిస్తాం అంటారని శ్రీ జగన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి దిక్కుమాలిన ముఖ్యమంత్రి దేశంలో ఉంటారా అని శ్రీ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ మోసం చేస్తూనే ఉన్నారన్నారు. టీడీపీలో మానిఫెస్టోలో కాపులను అధికారంలోకి రాగానే బీసీలు చేసేస్తామని అంటారు. ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకొని ఇలాంటి నాయకుడు కావాలా అని శ్రీజగన్ ప్రశ్నించారు. ఇలాంటి మోసం చేసే వ్యక్తి .. అబద్ధాలు చెప్పే వ్యక్తి .. ఎక్కడా ఉండరన్నారు. ఈసారి ఎన్నికలప్పుడు ప్రతి ఇంటికీ కేజీ బంగారం ఇస్తామంటారు. ప్రతి ఇంటికీ ఓ మారుతీ కారు కొనిస్తానని ఈ పెద్దమనిషి చెబుతారన్నారు. మారుతి కారు, కేజీ బంగారంతో పనిజరగదు అనుకుంటే ఏదైనా చెప్పేస్తారని శ్రీ జగన్ అన్నారు. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత రావాలి. ఇచ్చిన హామీలు నెరవేర్చని రాజకీయనాయకుడు రాజీనామా చేయాలి. మనమంతా చైతన్యవంతులై నాలుగు అడుగులు ముందుకు వేయాలని శ్రీ జగన్ ప్రజలకు పిలుపు నిచ్చారు. 

గుత్తి గుంతకల్ నియోజకవర్గం సమస్యలు.. 

ఇక్కడ వంద పడకల ఏరియా ఆసుపత్రి ఉంది. ఇక్కడ బ్లడ్ బ్యాంక్ కూడా నడపని పరిస్థితి ఉందన్నారు. ఇక్కడ నర్సులను తీసేస్తారని వారంతా భయపడుతున్నారు. ఇదే గుంతకల్లులోని తిలక్ నగర్ కాన్పుల ఆసుపత్రి ఉందన్నారు. ఇది పూర్తిగా మూసేసిన పరిస్థితి ఉందన్నారు. ఇదే గుత్తిలో.. ఎన్నిరోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయని శ్రీజగన్ ప్రశ్నించారు. ఐదు రోజులకు ఒకసారి, పదిరోజులకోసారి అని చెప్పారు. హంద్రీనీవాను తీసుకువచ్చానని బాబు చెబుతుంటే ఆశ్చర్యం వేస్తోంది. 9 సంవత్సరాలు బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండుసార్లు శంకుస్థాపనలు చేశారన్నారు. మర్చిపోయిన ఇదే హంద్రీనావాను దివంగత నేత ప్రియతమ నేత వైయస్ఆర్, నాన్నగారు చేశారన్నారు. నాలుగువేల కోట్లను ఐదు సంవత్సరాల్లో ఖర్చు చేశారన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు 80% పూర్తైందన్నారు. మిగిలిన 20% పనులు పూర్తి చేయలేని అసమర్థ ప్రభుత్వం ఇదన్నారు. రైతులు చేస్తున్న ధర్నాకు సంఘీభావం చెప్పటానికి వచ్చాను. అప్పుడు హంద్రీనీవాకు పిల్లకాల్వలు తవ్వితే లక్షాయాభై వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వొచ్చని అడిగాను. ఇప్పటికీ బాబు ఆ ఆలోచన లేదన్నారు. ఇదీ జిల్లా మీద చంద్రబాబు ప్రేమ అన్నారు.

ఇక్కడ కనిపిస్తున్న స్పిన్నింగ్ మిల్లు మూతపడి ఎన్నేళ్లు అయిందన్నారు. పిల్లలకు ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు రావాలంటే ప్రత్యేక హోదా రావాలన్నారు. ఎన్నికలప్పుడు ప్రత్యేక హోదా సంజీవని బాబు అన్నారు. 10 కాదు.. 15 ఏళ్లు హోదా కావాలన్నారు. అదే హోదాను బాబు కనుమరుగు చేశారు. ప్రత్యేక హోదాను తన కేసుల కోసం చంద్రబాబు అమ్మేశారని శ్రీ జగన్ తెలిపారు. రైతన్నల భరోసా కోసం పాదయాత్ర చేస్తున్నాని శ్రీ జగన్ అన్నారు. అక్కచెల్లెమ్మలు వడ్డీ కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. ఉద్యోగాలు కోసం పోరాడుతున్న యువత తోడుగా ఉండటం కోసం ప్రజాసంకల్పయాత్ర చేస్తున్నామని శ్రీ జగన్ తెలిపారు. 

నవరత్నాలపై జగన్ మాట్లాడుతూ.. 

నవరత్నాల్లో సూచనలు సలహాలు ఇవ్వండి. బీసీలపై చంద్రబాబుకు ఎక్కువ ప్రేమ ఉందంటున్నారు. బీసీలకు నాలుగు ఇస్త్రీ పెట్టెలు, కత్తెరలు ఇస్తే సరిపోతుందా అని శ్రీ జగన్ ప్రశ్నించారు. బీసీలపై నిజమైన ప్రేమను చూపించింది దివంగత నేత వైయస్ఆర్ మాత్రమే అని శ్రీ జగన్ గుర్తు చేశారు. బీసీ కుటుంబాల నుంచి డాక్టర్ల, ఇంజనీర్లు అయితే వారి కుటుంబాలు, బ్రతుకులు మారుతాయని.. దేశంలో ఎక్కడా జరగని విధంగా ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం తెచ్చారన్నారు. నువ్వుచదువు.. నేను చదవిస్తా అని తోడుగా ఉన్నారన్నారు. ఆనాయకుడ్ని నాన్నగార్ని స్ఫూర్తిగా  తీసుకొని నేను రెండు అడుగులు వేస్తున్నా. మీ పిల్లలు ఇంజనీరింగ్, డాక్టర్లు, పెద్దపెద్ద చదువులు చదివే పరిస్థితి ఉందా అని శ్రీ జగన్ ప్రశ్నించారు. ఇంజనీరింగ్ ఫీజులు లక్ష దాటుతున్నాయి. బాబు 35వేలు మాత్రమే ఇస్తున్నారన్నారు. ఆ పిల్లలు చదివే పరిస్థితి లేదు. మిగిలిన రూ.65వేలు ఎక్కడ నుంచి తీసుకురావాలని పేదవాడు ఆలోచిస్తున్నారని శ్రీ జగన్ తెలిపారు. మీపిల్లల్ని కాలేజీలకు పంపండి. లక్షల్లో ఫీజులు ఉన్నా కడతామన్నారు. పిల్లల్ని చదివించటమే కాకుండా వారి హాస్టల్స్ లో మెస్ ఛార్జీలు కూడా చెల్లిస్తామన్నారు. పిల్లల్ని చదివించటమే కాకుండా ప్రతి పిల్లాడికి సంవత్సరానికి రూ.20వేలు ఇస్తామన్నారు. పేదవాడి మీద ప్రేమను నాన్న ఒక్క అడుగు వేసి చూపిస్తే ఆయన కొడుకుగా రెండు అడుగులు ముందుకు వేస్తున్నా అన్నారు.

చిన్నపునాదులు గట్టిగా ఉంటే.. భవిష్యత్ బావుంటుందన్నారు. చిన్నారులను బడులకు పంపే తల్లికి రూ.15వేలు ఇస్తామని శ్రీ జగన్ తెలిపారు. పిలల్ని బడులకు పంపిస్తే.. ఆ పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు అయితే మన తల రాతలు మారతాయన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మనందరి పాలనలో పెన్షన్ రెండు వేలు చేస్తామన్నారు. అంతేకాకుండా.. పనికి వెళ్తే తప్ప కడుపు నిండని పరిస్థితిలో బీసీలు ఉన్నారు. పెన్షన్ రెండు వేలు ఇవ్వటమే కాకుండా దాని పరిమితి 45కు తగ్గిస్తామన్నారు. తినటానికి ఇబ్బందులు పడే పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరికీ మేలు జరుగుతుందన్నారు. ప్రతి పేదవాడికీ ఇళ్లు కట్టిస్తామన్నారు. ఏది కావాలన్నా ఏ జన్మభూమి కమిటీ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. మీ గ్రామంలో మీదగ్గరే మీ ఊర్లోనే పదిమందిని తీసుకొని గ్రామ సెక్రటేరియట్ పెట్టిస్తామన్నారు. పదిమందిని పెట్టి.. రేషన్ కార్డు, పింఛను, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ ఏది కావాలన్నా 72 గంటల్లోనే ఇప్పిస్తానని శ్రీ జగన్ హామీ ఇచ్చారు. చెప్పిన ప్రతి దానికీ సూచనలు, సలహాలు ఇవ్వమని శ్రీ జగన్ కోరారు. తద్వారా మంచి మేనిఫెస్టో తీసుకువస్తామన్నారు. ఆ మేనిఫెస్టో కేవలం రెండు, మూడు పేజీలే ఉంటుందన్నారు. బాబులా మోసం చేయమన్నారు. ఆ మేనిఫెస్టోలో ప్రతి అంశాన్ని చేసి చూపిస్తామన్నారు. చెప్పినవే కాదు.. చెప్పనివి కూడా చేసి చూపిస్తామన్నారు. చేసి చూపించిన తర్వాత ఐదు ఏళ్ల తరువాత మిమ్మల్ని మరొక్కసారి ఆశీర్వదించమని కోరతానని జగన్ అన్నారు.

Click here for Photogallery