ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు విష‌యం లేదు

ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు విష‌యం లేదు

07-12-2017

ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు  విష‌యం లేదు

ఆయ‌న‌ది రెండు మూడు రోజుల హ‌డావుడే. అనంత‌పురం జిల్లా పాద‌యాత్ర‌లో మీడియాతో జ‌గ‌న్ చిట్ ఛాట్‌. పోల‌వ‌రంకు వైయ‌స్సార్‌సీపీ ఎంఎల్ ఏలు, ఎంపీలు వెళుతున్నార‌ని తెలిసి.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆ ప్ర‌దేశానికి వెళ్ళారు అంతే త‌ప్పా ఆయ‌న‌కు విష‌యం లేదు. రెండు మూడు రోజుల హ‌డావుడి త‌ప్పా ఏమీ లేదు ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు. వైయ‌స్సార్ హ‌యాంలో అవినీతి చోటు చేసుకుంద‌న్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్. దాన్ని ప‌వ‌న్ క‌ల్యాణ్ చూశారా? కాంగ్రెస్‌ది అవినీతి మ‌యం అయితే అందులో పీఆర్‌పీని ఎందుకు విలీనం చేశారు? అనుభ‌వం విష‌యాన్ని ప్ర‌స్తావిస్తున్నారు. ఏ అనుభ‌వం ఉన్న‌ద‌ని ఎన్నిక‌ల‌కు ఆరు నెల‌ల ముందు ప‌వ‌న్, చిరంజీవి పీఆర్‌పీని ప్రారంభించారు?