చిత్తూరు జిల్లా పెద్దూరులో వైయస్ జగన్ ప్రసంగం

చిత్తూరు జిల్లా పెద్దూరులో వైయస్ జగన్ ప్రసంగం

04-01-2018

చిత్తూరు జిల్లా పెద్దూరులో వైయస్ జగన్ ప్రసంగం

- వైయస్ఆర్ సీపీ విజయయాత్ర కుప్పం నుంచే ప్రారంభం కావాలి
- కుప్పంలో చంద్రబాబును ఓడిస్తే బీసీలకు న్యాయం: వైయస్ జగన్
- బీసీలకు ఏం చేశారని చంద్రబాబును నిలదీయండి: వైయస్ జగన్
- కుప్పంలో చంద్రమౌళిని గెలిపిస్తే కేబినెట్ లోకి తీసుకుంటా: వైయస్ జగన్
- బస్సుయాత్రలో కుప్పం వచ్చి ప్రతి మండలం పర్యటిస్తానని ప్రకటించిన వైయస్ జగన్

ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కుప్పంలో మీకు తోడుగా వచ్చేందుకు, నిలబడేందుకు చంద్రమౌళి అన్న వచ్చారని జగన్ తెలిపారు. కుప్పం నియోజకవర్గాన్ని ఏ రోజు చంద్రమౌళి వదిలిపెట్టలేదని ఇప్పటికీ కుప్పం ప్రజలకు ఎల్లవేళలా వైయస్ఆర్సీపీ తోడుగా ఉందన్నారు. ఇవాళ రాష్ట్రంలో అన్యాయమైన చంద్రబాబు పాలన మీరు చూశారని ప్రతి కార్యకర్త ఓ అర్జునుడులా.. సవ్యసాచి కావాలని శ్రీ జగన్ పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త తన ఊరిలో ఒకరికి పదిమందికి చంద్రబాబు హయాంలో మోసాలు గురించి చెప్పాలి. చంద్రబాబు అన్యాయపు పాలన, రాక్షసపు పాలన గురించి ప్రజలకు వివరించి చెప్పాలని శ్రీ జగన్ సూచించారు. చిత్తూరు జిల్లాలో అత్యధికమైన బీసీలు ఎక్కడ ఉన్నారంటే.. అది కుప్పంలోనే ఉన్నారు. అత్యధిక బీసీలు ఉన్న కుప్పంలో చంద్రబాబు బీసీల్ని మోసం చేస్తున్నారని జగన్ తెలిపారు.

చంద్రగిరిలో బీసీలు తక్కువ ఉన్నారని బీసీలు అమయాకులు అని, మోసం చేయటం సులభమని కుప్పాన్ని చంద్రబాబు ఎంచుకున్నారని శ్రీ జగన్ వివరించారు. బీసీ కులానికి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రమౌళి అన్నను వైయస్ఆర్సీపీ మీ ముందుకు తెచ్చింది. బీసీల మీద ప్రేమ ఉందంటూ.. చంద్రబాబు వస్తే.. బీసీలకు ఏం చేశారని గట్టిగా అడగండని జగన్ తెలిపారు. బీసీలకు నాలుగు ఇస్త్రీ పెట్టెలు, నాలుగు కత్తెరలు ఇస్తే  సరిపోతుందా అని చంద్రబాబును నిలదీయమని జగన్ ప్రజలకు సూచించారు. దివంగత నేత వైయస్ఆర్ హయాంలో మా పిల్లల్ని ఎంత ఖర్చైనా ఇంజనీర్లను, డాక్టర్లు చదవించారని మరి నువ్వు (చంద్రబాబు) ఏం చేశావో చెప్పమని నిలదీయమన్నారు. ఈ రోజున ఇంజనీర్లు చదవాలంటే లక్షపైనే అవుతోందన్నారు. చంద్రబాబు ముష్టివేసినట్లు 30-35 వేలు వేస్తున్నారన్నారు.

దేవుడి దయవల్ల, మీ అందరి ఆశీర్వాదం వల్ల మన ప్రభుత్వం వస్తే.. నవరత్నాల ద్వారా పేదవాడు, బీసీలు గొప్పగా లాభపడతారన్నారు. నవరత్నాల వల్ల ప్రతి రైతన్న ముఖంలో నవ్వు కనిపిస్తుందన్నారు. వైయస్ఆర్ కలలు కన్న సువర్ణయుగం వస్తుందన్నారు. దీనికోసం ప్రతి కార్యకర్త సవ్యసాచి కావాలన్నారు. మన గెలుపు కుప్పం నుంచే ప్రారంభం కావాలన్నారు. ఇక్కడ చాలా మంది వచ్చారు. ప్రతి ఒక్కరినీ పేరుపేరునా కలుసుకునే అవకాశం లేదు. ఎవ్వరూ మరోలా భావించవద్దని శ్రీ జగన్ కోరారు. ప్రతి ఒక్కరూ నాగుండెల్లో ఉన్నారన్నారు. మీ అందరూ చంద్రమౌళిని గెలిపిస్తే చంద్రబాబు చేసినదాని కంటే ఎక్కువ చేస్తానని జగన్ తెలిపారు. చంద్రమౌళి అన్నను కేబినెట్ లోకి తీసుకొని అంతకంటే ఎక్కువ చేస్తానని జగన్ స్పష్టం చేశారు. తన పాదయాత్ర కుప్పంవరకు రాకపోవచ్చని.. బస్సుయాత్ర ప్రారంభం అవుతుందని.. అందులో ఏఏ నియోజకవర్గాలు కవర్ చేయలేకపోయానో వాటిని తను సందర్శిస్తానని జగన్ స్పష్టం చేశారు.

 Click here for Photogallery