మంత్రి లోకేశ్‌ అమెరికా పర్యటన

మంత్రి లోకేశ్‌ అమెరికా పర్యటన

11-01-2018

మంత్రి లోకేశ్‌ అమెరికా పర్యటన

ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ పెట్టుబడుల కోసం మంత్రి నారా లోకేశ్‌ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. గత నెలలో అమెరికా వెళ్లి గూగుల్‌ ఎక్స్‌, జోహో తదితర కంపెనీలతో ఒప్పందాలు చేసుకున వచ్చిన ఆయన మరోమారు పెట్టుబడుల కోసం అమెరికా బాటాపట్టనున్నారు. తన పర్యటనలో భాగంగా 35-40 పెద్ద కంపెనీల సీఈవోలతో భేటీ కానున్నారు. పలు చిన్న కంపెనీల ప్రతినిధులతోనూ సమావేశాలు జరపనున్నారు. డల్లాస్‌, లాస్‌ఏంజెల్స్‌, శాన్‌ఫ్రాన్సిస్‌కో, సియాటిల్‌, అట్లాంటా, న్యూయార్క్‌, బోస్టన్‌ నగరాల్లో లోకేశ్‌ పర్యటన ఖరారైంది. ఒకపక్క కంపెనీల సీఈవోలతో భేటీలు, మరోవైపు ప్రవాస తెలుగు పారిశ్రామికవేత్తలతో సమావేశాలు ఉంటాయి. ఈ పర్యటనలో కొన్ని పెద్ద ఒప్పందాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.