శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి

శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి

11-01-2018

శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దర్శించుకున్నారు. తిరుమల క్షేత్ర సంప్రదాయన్ని పాటిస్తూ శ్రీవారి పుష్కరిణిలోకి చేరుకుని పవిత్రజలాలను ప్రోక్షణం చేసుకున్నారు. అనంతరం శ్రీవరాహ స్వామివారిని దర్శించుకుని కుటుంబ సమేతంగా వైకుంఠ-1 కాంప్లెక్స్‌కు చేరుకున్నారు. సామన్య భక్తులతో పాటు క్యూలైన్‌ మార్గంలో శ్రీవారి ఆలయానికి వచ్చారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం అద్దాల మండపంలో ఆయనకు పండితులు వేద ఆశీర్వచనం చేశారు. టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, ఏఈవో శ్రీనివాసరాజు రాష్ట్రపతికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు. ఉపరాష్ట్రపతి వెంటన మంత్రి అమర్‌నాథ్‌ రెడ్డి, చిత్తూరు జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్న ఉన్నారు.