పారిశ్రామికాభివృద్ధికి ఏపీలో ఎన్నో అవకాశాలు

పారిశ్రామికాభివృద్ధికి ఏపీలో ఎన్నో అవకాశాలు

23-01-2018

పారిశ్రామికాభివృద్ధికి ఏపీలో ఎన్నో అవకాశాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ అన్నారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు రెండవ రోజు కార్యక్రమాల్లో బిజినెస్‌ బ్రేక్‌ ఫాస్ట్‌ సమావేశం ప్యానెల్‌ డిస్కషన్‌లో మంత్రి లోకేష్‌ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో  ఎలక్ట్రానిక్స్‌, సోలార్‌ రంగాల్లో క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. విశాఖ- చెన్నై, బెంగళూరు-చెన్నై కారిడార్లు వస్తున్నాయన్నారు. నీటి వనరులు కల్పించడం వల్ల అనంతపురం జిల్లాకు కియా పరిశ్రమ, ఆటోమొబైల్స్‌ పరిశ్రమలు వచ్చాయని తెలిపారు.