సైద్ ఎ. అల్ హద్రమీతో సీఎం చంద్రబాబు సమావేశం

సైద్ ఎ. అల్ హద్రమీతో సీఎం చంద్రబాబు సమావేశం

23-01-2018

సైద్ ఎ. అల్ హద్రమీతో సీఎం  చంద్రబాబు సమావేశం

దావోస్‌ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సౌదీ ఆర్మ్‌కో ఇంటర్నేషనల్‌ ఆపరేషన్స్‌ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌ సైద్‌ ఎ. అల్‌ హద్రమీతో సమావేశం అయ్యారు. పెట్రోలియం రిఫైనరీ రంగంలో సౌదీ ఆర్మ్‌కో ప్రసిద్ధి చెందినది. గతంలో సౌదీ ఆర్మ్‌కోతో చంద్రబాబు చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్‌ చమురు, సహజవాయు నిక్షేపాలు అపారంగా ఉన్నాయని, ఏపీలో పెట్టుడులు పెట్టాలని కోరారు. అలాగే విశాఖలో జరగనున్న సీఐఐ సదస్సుకు సౌదీ ఆర్మోకోను చంద్రబాబు ఆహ్వానించారు.