రాష్ట్రానికి క్యూ కడుతున్న సంస్థలు

రాష్ట్రానికి క్యూ కడుతున్న సంస్థలు

24-01-2018

రాష్ట్రానికి క్యూ కడుతున్న సంస్థలు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్‌ పర్యటన ఫలవంతమవుతోంది. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సంబంధించిన 50 సంస్థలు మెడ్‌టెక్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌కు లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ ఇచ్చాయి. రాష్ట్రాన్నికి పెట్టుబడులు తీసుకొచ్చే అంశంలో గత ఏడాది ఏపీఈడీబీతో అవగాహన ఒప్పందం చేసుకున్న మిడ్‌టెక్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ ప్రతినిధులు దావోస్‌ పర్యటనలో వున్న ముఖ్యమంత్రిని కలిశారు. కనీసం 150 కంపెనీలను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్న మెడ్‌టెక్‌ ఇన్నోవేష్‌ సెంటర్‌, తొలిదశలో 60 సంస్థలతో సంప్రదింపులు పూర్తి చేసింది. కేవలం పెట్టుబడులు తీసుకురావడమే కాకుండా ఆ సంస్థలకు దోహదపడేలా రాష్ట్రంలో అనుకూల వాతావరణం నెలకొల్పోందుకు మెడ్‌టెక్‌ ప్రయత్నిస్తోంది.

విశాఖ మెడ్‌టెక్‌ పార్కులో భాగస్వామ్యం తీసుకురావడమే కాకుండా ఆ సంస్థలకు దోహదపడేలా రాష్ట్రంలో అనుకూల వాతావరణ నెలకొల్పేందుకు మెడ్‌టెక్‌ ప్రయత్నిస్తోంది. విశాఖ మెడ్‌టెక్‌ పార్కులో భాగస్వామ్యం తీసుకుని క్రమంగా విస్తరణకు ప్రణాళికలు రచిస్తున్న మెడ్‌టెక్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌, ఈ పార్క్‌లో యురోపియన్‌ సెగ్మెంట్‌ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోది. ఇది సాకారమైతే అత్యున్నత సాంకేతిక నైపుణ్యం కలిగిన 45 నుంచి 50 వేలకు పైగా శాస్త్ర నిపుణులకు ఉద్యోగాలు దక్కేలా మెడ్‌టెక్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ పని చేస్తోంది. ముఖ్యమంత్రిని కలిసినవారిలో మెడ్‌టెక్‌ ఇన్నోవేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఫెలిక్స్‌ గ్రెసార్డ్‌, బోర్డ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ హన్స్‌ ఫ్లోరిన్‌, సీఈవో డాక్టర్‌ క్రిస్టోఫ్‌ కాస్క్‌ ఉన్నారు.