ఎపిలో డేటా సెంటర్ ఏర్పాటుకు 'మంత్ర' రెడీ

ఎపిలో డేటా సెంటర్ ఏర్పాటుకు 'మంత్ర' రెడీ

24-01-2018

ఎపిలో డేటా సెంటర్ ఏర్పాటుకు 'మంత్ర' రెడీ

దావోస్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమైన 'మంత్ర డాటా సెంటర్స్‌' అధినేతలు రాష్ట్రంలో తమ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ లో డేటా సెంటర్‌ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రితో సమావేశమైన 'మంత్ర డాటా సెంటర్స్‌' బోర్డ్‌ మెంబర్‌ మోహన్‌ చైనాని అన్నారు. ఇందుకు అవసరమైన భూమి, విద్యుత్‌, ఫైబర్‌ వసతులు కల్పించాలని మోహన్‌ కోరగా, కావాల్సిన సౌకర్యాల కల్పనతో పాటు అన్ని అనుమతులు 21 రోజుల్లో ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. గూగుల్‌, యాక్సెంచర్‌ డేటా సెంటర్లు కూడా ఏపీలో నెలకొల్పేలా సహకరిస్తామని మోహన్‌ ఈ సందఠంగా పేర్కొన్నారు.