విద్యుత్ నిల్వపై పైలెట్ ప్రాజెక్టుకు సుజ్లాన్ గ్రూప్ సంసిద్ధత

విద్యుత్ నిల్వపై పైలెట్ ప్రాజెక్టుకు సుజ్లాన్ గ్రూప్ సంసిద్ధత

24-01-2018

విద్యుత్ నిల్వపై పైలెట్ ప్రాజెక్టుకు సుజ్లాన్ గ్రూప్ సంసిద్ధత

దావోస్‌లో పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో వివిధ సంస్థల అధినేతలు సమావేశమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. పునరుత్పాదక విద్యుత్‌ నిల్వకు సంబంధించి పైలెట్‌ ప్రాజెక్ట్ను ఆంధ్రప్రదేశ్లో చేపట్టేందుకు సుజ్లాన్‌ గ్రూప్‌ ఆసక్తి కనబరుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో పవన, సౌర విద్యుత్‌ రంగాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఈ సంస్థ పవన, సౌర, గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ రంగాలలో తమ భవిష్యత్‌ విస్తరణ ప్రణాళికలపై దష్టి పెట్టింది. పునరుత్పాదక విద్యుత్‌ నిల్వ విషయంలో భారీ పరిశోధనలు చేస్తున్నామని సుజ్లాన్‌ గ్రూప్‌ సీఎండీ తుల్సి తంతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తమ సంస్థకు గ్యాస్‌ కేటాయింపులు అంశాన్ని పరిష్కరించిందని ముఖ్యమంత్రితో తంతి వెల్లడించారు.