'ఇన్నోవేషన్ వ్యాలీ ఆఫ్ ది వరల్డ్'గా ఏపీ

'ఇన్నోవేషన్ వ్యాలీ ఆఫ్ ది వరల్డ్'గా ఏపీ

25-01-2018

'ఇన్నోవేషన్ వ్యాలీ ఆఫ్ ది వరల్డ్'గా ఏపీ

ఆంధ్రప్రదేశ్‌ను 'ఇన్నోవేషన్‌ వ్యాలీ ఆఫ్‌ ది వరల్డ్‌'గా మార్చడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దావోస్‌లో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పాలన-సంక్షేమం విషయంలో అంతర్జాతీయస్థాయి అందుకోవడమే గీటురాయిగా నిర్ణయించినట్టు వెల్లడించారు. 'ప్రజలే ముందు' అన్న నినాదంతో '1100' కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశామని, ఇది అదుÄ్భత ఫలితాలను ఇస్తోందనన్నారు. ఈ కాల్‌ సెంటర్‌ ద్వారా రోజుకు 15 లక్షల మందికి కాల్‌ చేసే వీలుందన్నారు. పారదర్శక పాలన మా విధానమని పేర్కొన్న ముఖ్యమంత్రి రియల్‌ టైమ్‌లో నిర్ణయాలు తీసుకోవడం, రియల్‌ టైమ్‌ పర్యవేక్షణ, రియల్‌ టైమ్‌ పాలన ద్వారా ఏపీని ఇన్నోవేషన్‌ వ్యాలీగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. 'ఇన్నోవేషన్‌ వ్యాలీ ఆఫ్‌ ది వరల్డ్‌'గా ఏపీని త్వరలోనే మార్చడం తమ ధ్యేయమని తెలిపారు.

ప్యానెల్‌ డిస్కషన్‌లో మీరు ఎక్కువ దేనికి ప్రాధాన్యత ఇస్తారని ఓ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాధానమిస్తూ,  'ప్రభుత్వానికి ప్రజల నుంచి సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన ప్రతి వినతి పరిష్కారమై తీరాలనేది మా విధానం. అన్ని వ్యవస్థల సమాచారాన్ని ఒక దగ్గరకు చేర్చడం, తక్కువ ఖర్చుతో ప్రతి ఒక్కరూ అత్యంత ఆనందదాయకమైన జీవనం సాగించేలా చూడటం మా లక్ష్యం. రాష్ట్రంలో ప్రజలందరూ అత్యున్నత జీవనాన్ని సాగించేందుకు అవసరమైన విద్యుత్‌, ఆరోగ్యం, ఆదాయం వంటి భద్రతలు కల్పించడమే మా ప్రాధాన్యతలు.' అని ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం ఇచ్చారు.

దావోస్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి బృందంలో ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ పరకాల ప్రభాకర్‌, ఐటీ-పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నారా లోకేష్‌, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి. సాయిప్రసాద్‌, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌, ఆంధ్రప్రదేశ్‌ ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు సీఈఓ జాస్తి కృష్ణ కిశోర్‌, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్‌ ఆరోకియా రాజ్‌, వ్యవసాయ సలహాదారు టి. విజయ్‌ కుమార్‌ ఉన్నారు.