ఆంధ్రప్రదేశ్ కు ఎయిర్ బస్?

ఆంధ్రప్రదేశ్ కు ఎయిర్ బస్?

25-01-2018

ఆంధ్రప్రదేశ్ కు ఎయిర్ బస్?

ఆంధ్రప్రదేశ్‌లో సి-295 విమానాల ఉత్పత్తి  కేంద్రం ఏర్పాటుకి ఎయిర్‌బస్‌ సంస్థకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని,  అన్ని అనుమతులూ వెంట వెంటనే ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దావోస్‌లో ఎయిర్‌బస్‌ డిఫెన్స్‌ సంస్థ సీఈవో డిర్క్‌ హోక్‌ తదితరులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఎయిర్‌బస్‌ సంస్థ టాటా గ్రూప్‌తో కలసి ఈ విమాన తయారీ కేంద్రాన్ని భారత్‌లో ఏర్పాటు చేయనుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని ఏపీ కోరుతోంది. ఎయర్‌బస్‌ సంస్థ ప్రతినిధులు గత సంత్సరమే రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించారు. రాష్ట్రాన్నీ సందర్శించారు. ఈ ఏడాది  చివరిలోగా ఎట్టిపరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు నెలకొల్పుతాం అని డిర్క్‌ హోక్‌ పేర్కొన్నారు. వివిధ దేశాల్లోని తమ ఉత్పాదక యూనిట్లను ఒకసారి సందర్శించాలని చంద్రబాబుని ఆయన ఆహ్వానించారు.