సీఎం చంద్రబాబు ఆనంద్ మహింద్రా భేటీ

సీఎం చంద్రబాబు ఆనంద్ మహింద్రా భేటీ

25-01-2018

సీఎం చంద్రబాబు  ఆనంద్ మహింద్రా భేటీ

ప్రముఖ పారిశ్రామికవేత్త, మహింద్రా అండ్‌ మహింద్రా సంస్థ అధినేత అయిన ఆనంద్‌ మహింద్రా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుడి నాయకత్వాన్ని ఎంతగానో మెచ్చుకున్నారు. స్విట్జర్లాండ్‌ లోని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడికి అన్ని దేశాల నుంచి ప్రముఖులు విచ్చేశారు. వీరిలో మన దేశం నుంచి ఆంధ్రప్రదేశ్‌ మ్యుమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు. దావాస్‌లో ఆంధ్రప్రదేశ్‌ లాంజ్‌ పేరుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాబిన్‌లో చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి లోకేష్‌ తదితరులతో కూడిన బృందంతో ఆనంద్‌ మహింద్రాతో భేటీ అయింది. ఈ సమావేశంపై ఆనంద్‌ మహింద్రా తన ట్విట్టర్‌ పేజీలో ప్రశంసలు కురిపించారు. దావోస్‌ లో నారా చంద్రబాబుతో  భేటీ నాకు చాలా ముఖ్యమైనది. ఆధునిక భారత దేశంలో ఎంతో స్ఫూర్తినిచ్చే నేతల్లో చంద్రబాబు ఒకరు. ఆయన్ను కలుసుకోవడం పవర్‌ ప్యాక్‌ లో ప్లగ్‌ ఉంచినట్లు. మీ బ్యాటరీలు అప్పటికప్పుడే రీచార్జ్‌ అవుతాయి అంటూ చంద్రబాబుతో భేటీని తనకు ఎంతో శక్తినిచ్చినట్టు అభివర్ణించారు.