పారిశ్రామిక అభివృద్ధిలో టెక్నాలజీదే కీలకపాత్ర

పారిశ్రామిక అభివృద్ధిలో టెక్నాలజీదే కీలకపాత్ర

25-01-2018

పారిశ్రామిక అభివృద్ధిలో టెక్నాలజీదే  కీలకపాత్ర

పాలన, పారిశ్రామిక అభివృద్ధిలో టెక్నాలజీదే కీలకపాత్ర అని, కాలానికి అనుగుణంగా మారకపోతే వెనకబడతామని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ పేర్కొన్నారు. దావోస్‌ పర్యటనలో ఉన్న ఆయన  ప్రపంచీకరణలో ఆర్థిక వ్యవస్థ- అభివృద్ధిపై జరిగిన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తయారీ రంగం అభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నామని, నూతన పాలసీలు, రాయితీలు కల్పిస్తున్నామని చెప్పారు. ఒక్క ఫాక్స్‌ కాన్‌ మొబైల్‌ తయారీ కంపెనీలోనే 15 వేల మంది మహిళలు పనిచేస్తున్నారని తెలిపారు. సేవారంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి పలు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నామని అన్నారు. విద్యార్థులను డేటా సైంటిస్ట్‌లుగా తీర్చిదిద్దేందుకు మ్యూసిగ్మా కంపెనీతో కలిసి అకాడమీ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీలో శిక్షణ కోసం ఏతిరియం అనే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. యూనివర్సిటీ ఏర్పాటు చెయ్యబోతున్నాని తెలిపారు.