సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన విజయవంతం

సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన విజయవంతం

27-01-2018

సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన విజయవంతం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్‌ పర్యటన విజయవంతంగా ముగిసింది. ముఖ్యమంత్రి నాలుగు రోజుల పాటు దావోస్‌లో పర్యటించారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా ఆయన అనేక ప్రఖ్యాత సంస్థల అధిపతులతో చర్చలు జరిపారు. తొలిరోజునే జ్యూరిక్‌తో సిస్టర్‌ స్టేట్‌ ఒప్పందం కుదిరింది. కృష్ణపట్నంలో భారీ రిఫైనరీ ఏర్పాటునకు సౌదీ ఆరమ్‌కో సిద్దమైంది. ఏజీల్‌ ఆపరేషన్స్‌ కూడా తన కార్యకలపాలను ఏపీలో చేపట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అమరావతిలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్యూచరిస్ట్‌ క్యాంపస్‌ ఏర్పాటుకు ముందుకువచ్చింది. హిటాచీ కూడా రాష్ట్రంలో పెట్టుబడులపై దృష్టి సారించింది. ప్రతిష్ఠాత్మక మెడెటెక్‌ ద్వారా 50 సంస్థలు ఆంధ్రపదేశ్‌కు రానున్నాయి. రూ.5000 కోట్ల భారీ మొత్తంతో భారత్‌లోని నవ్యాంధ్రలో అడుగు పట్టేందుకు పయనీర్‌ సంస్థ సానుకూలతను వ్యక్తం చేసింది. వేదాంత సంస్థ యూనివర్సిటీ టౌన్‌షిప్‌ను ప్రతిపాదించింది. టాటా-ఎయిర్‌ బస్‌ సంయుక్త భాగస్వామ్యంలో ఈ  ఏడాదే నవ్యాంధ్ర కేంద్రంగా సీ-295 రవాణా విమానాల తయారీపై సృష్టమైన హామీ లభించింది.

దావోస్‌ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు మంత్రులు యనమల రామకృష్ణుడు, నారా లోకేష్‌, సీఎం ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్‌, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌, ఆంధ్రప్రదేశ్‌ ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు సీఈవో జాస్తి కృష్ణ కిశోర్‌, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్‌ ఆరోకియా రాజ్‌, వ్యవసాయ సలహాదారు టి.విజయ కుమార్‌, మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.