78వ రోజు మొదలైన వైఎస్ జగన్ పాదయాత్ర

78వ రోజు మొదలైన వైఎస్ జగన్ పాదయాత్ర

03-02-2018

78వ రోజు మొదలైన వైఎస్ జగన్ పాదయాత్ర

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం సర్వేపల్లి నియోజకవర్గం, మరుపూరు శివారు నుంచి వైఎస్‌ జగన్‌ 78వరోజు ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి మట్టెంపాడు, మోపూరు క్రాస్‌, మొగళ్లపాలెం మీదగా సౌత్‌ మోపూరు వరకు ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. మొగుళ్లపాలెంలో పార్టీ పతాకావిష్కరణ చేయనున్నారు. సౌత్‌ మోపూరులో బహిరంగ సభలో వైఎస్‌ జగన్ పాల్గొననున్నారు.

Click here for Photogallery