బుచ్చిరెడ్డిపాలెంలో వైయస్ జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

బుచ్చిరెడ్డిపాలెంలో వైయస్ జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

05-02-2018

బుచ్చిరెడ్డిపాలెంలో వైయస్ జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

- కొవ్వూరు సహకార చక్కెర ఫ్యాక్టరీ 1978 నుంచి నడుస్తోందని రైతులు తెలిపారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక 2002లో కొవ్వూరు చక్కెర ఫ్యాక్టరీ మూత పడిందని రైతులు తెలిపారన్నారు. 

- 2002లో నెల్లూరు స్పిన్నింగ్ మిల్స్ చంద్రబాబు మూయించేశారు. కేవలం రూ.12 కోట్లకే రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ కు పప్పూబెల్లాల్లా చంద్రబాబు అమ్మేశారు.
- చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ సహకార సంస్థలను మూసివేయించారు.
- కొవ్వూరు చక్కెర ఫ్యాక్టరీని కాపాడుకోవటం కోసం కోర్టులకు వెళ్లి రైతులు పోరాడారు.
- నాన్నగారు వచ్చాక చక్కెర ఫ్యాక్టరీ తెరుచుకుందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. 

- మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఫ్యాక్టరీ మూతపడింది. కానీ, కొవ్వూరుకు వచ్చి చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తానని చంద్రబాబు అబద్ధాలు చెప్పారు. కొవ్వూరు చక్కెర ఫ్యాక్టరీ మూతపడి నాలుగేళ్లైంది. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులకు రూ.23 కోట్ల బకాయిలు ఉంది. కొవ్వూరు చక్కెర ఫ్యాక్టరీ 14 మండలాల్లో 5వేల రైతులకు తోడుగా ఉండేది. తమ పంటలకు మంచి ధరలు ఇవ్వటంతో రైతుల ముఖంలో చిరునవ్వులు కనిపించేవి.

- కొడవులూరు సమీపంలో ఇఫ్కో సంస్థతో ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ పెట్టాలని పీవీ హయాంలో కదలికలు జరిగాయి. దివంగత మహానేత వైయస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మళ్లీ నాలుగు అడుగులు ముందుకు పడ్డాయి. ఇఫ్కో కిసాన్ సెజ్ కింద ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లటానికి ప్రయత్నాలు జరిగాయి. నాన్నగారు వెళ్లిపోయిన తర్వాత.. రబీలో అత్యధికంగా వరిపంట పండేది నెల్లూరు జిల్లానే. ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాల కంటే ఎక్కువ వరి పంట పండిస్తున్నారు ఇక్కడ. 

- చంద్రబాబు లంచాలు తీసుకొని ఆ భూములను కోకో కోలా ఫ్యాక్టరీకి ఇస్తారు. ఆ ఫ్యాక్టరీకి రైతులకు ఇవ్వాల్సిన నీళ్లను తరలిస్తారు. చంద్రబాబు రైతు వ్యతిరేకి అనటానికి ఇంతకన్నా నిదర్శనం ఏమి కావాలి. 

- సంగం, నెల్లూరు బ్యారేజీల కోసం రూ.1100 కోట్లు ఖర్చు చేసి ఆధునీకరణ పనులు ఆరోజుల్లోనే చేశారు. 80శాతం పనులు ఆ రోజుల్లోనే పూర్తయ్యాయి. మిగిలిన 20 శాతం పనులు ఎక్కడేసిన గొంగళిలా అక్కడ ఉన్నాయి. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ఇదీ పరిస్థితి. 

- ముదివర్తిలో పెన్నాపై కాజ్ వే కోసం ప్రసన్నా కోరితే.. రూ.250 కోట్ల ఖర్చుతో ప్రపోజల్స్ పెట్టమని వైయస్ఆర్ ఆదేశించారు. దివంగత మహానేత వైయస్ఆర్ తర్వాత అది పనిచేసుకున్నవారే లేరు. 

- ఏసీడీ పేరుతో విద్యుత్ శాఖ రైతులను బాధేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
- బాబు పాలనలో నాలుగేళ్లు అయిపోయింది. మరో సంవత్సరంలో ఎన్నికలు జరగబోతున్నాయంటూ బాబు కార్యకర్తలకు చెబుతున్నారు. 

- సంవత్సరంలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి.. మనకు ఎలాంటి నాయకుడు కావాలో గుండెల మీద చేతులు వేసి కోరుతున్నా. ఎన్నికలప్పుడు చంద్రబాబు అన్న మాటలు ఏమిటి? ఎన్నికలయ్యాక ఒక్కమాట మీద నిలబడ్డారా? అని ప్రశ్నించిన శ్రీ వైయస్ జగన్.

- ఎన్నికలు అయ్యాక అబద్ధాలు చెప్పేవారు నాయకుడుగా కావాలా అని ప్రశ్నించిన శ్రీ వైయస్ జగన్. 
- మోసాలు చేసేవాడు మీకు నాయకుడుగా కావాలా అని ప్రశ్నించిన శ్రీ వైయస్ జగన్.

- గత రెండు మూడు రోజులుగా టీవీలు చూస్తే.. ఆశ్చర్యం వేస్తోంది. ఎన్డీయేలో చంద్రబాబు నాలుగేళ్లుగా భాగస్వామిగా ఉన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు కేంద్ర కేబినెట్ ఆమోదిస్తుంది. చంద్రబాబు ఎంపీలు కూడా కేబినెట్ లో ఉన్నారు. ఇది వాస్తవం అయితే.. నరేంద్ర మోడీ బడ్జెట్ ప్రవేశపెడితే.. చంద్రబాబు ఎందుకు గింజుకుంటున్నారు. 

- అన్యాయం జరిగిందని చంద్రబాబు అంటుంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. మరి, కేంద్ర మంత్రులుగా ఉన్న నీ ఎంపీలు ఎందుకు ఆమోదం తెలిపారు. 

- నాలుగేళ్లుగా భరించాం.. నిరీక్షించాం.. అంటూ లీకులు ఇచ్చారు. మరి, ప్రతి బడ్జెట్ లోనూ నీ ఎంపీలు, మంత్రులు ఆమోదం తెలిపాకే బడ్జెట్ ప్రవేశపెట్టారన్న సంగతి చంద్రబాబుకు తెలీదా? 

- ఎన్నికలప్పుడే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకు వస్తారు.

- అనగనగా.. ఓ ముద్దాయి. అతన్ని కోర్టు బోనులో నిలబెట్టారట. అతను జడ్జి రాగానే.. తల్లిదండ్రులు లేనివాడిని అంటూ బిగ్గరగా అరవటం మొదలుపెట్టారు. ఏందబ్బా.. తల్లిదండ్రులు లేని అనాధను అంటున్నారు. పోలీసులు ఎందుకు తెచ్చారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను ఏందబ్బా.. ఇతగాడు చేసిన తప్పు అని అడిగారు. సర్.. ఇతనవన్నీ దొంగ ఏడుపులు. తల్లిదండ్రులు చంపిన వ్యక్తి సర్ అని తెలిపారు. రాష్ట్రాన్ని విడగొట్టమని కోరిన వ్యక్తి చంద్రబాబు. ప్రత్యేక హోదా సంజీవన్న వ్యక్తి చంద్రబాబు. ఈ రోజు ప్రత్యేకహోదా సంజీవనా అని మనళ్లే రివర్స్ లో చంద్రబాబు అడుగుతారు. ఇదే పెద్దమనిషి దుగ్గరాజపట్నం చట్టంలో ఉంటే.. ఇవ్వకపోయినా ఫర్వాలేదన్న పెద్దమనిషి ఇదే చంద్రబాబు. 

పోలవరం ప్రాజెక్టు ఏపీప్రజల ఆశాజ్యోతి ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు ఈ స్థితిలో ఉండటానికి చంద్రబాబే కారణం. కోర్టులో దొంగ ఏడుపులు ఏడ్చే ముద్దాయికి చంద్రబాబుకు తేడా ఉందా అని ప్రశ్నించిన శ్రీ వైయస్ జగన్. 

- చంద్రబాబు తనకు అనుకూలమైన మీడియా వ్యవస్థను వాడుకోవటం దేశచరిత్రలో ఎవ్వరూ చేయరేమో. అది చంద్రబాబుకు సొంతమన్న శ్రీ వైయస్ జగన్.

- ఇటువంటి అన్యాయమైన పాలన, అబద్ధాల పాలన మీరంతా క్షమిస్తే.. ఈ పెద్దమనిషి మిమ్మల్ని మోసం చేయటం కోసం.. నాలుగు అడుగులు ముందుకు వేసి.. రైతుల రుణాలు బేషరుతుగా మాఫీ, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాల మాఫీ, ప్రతి ఇంటికీ ఉద్యోగం ఇస్తామంటే నమ్మరని.. పై స్థాయికి వెళ్తారు. ప్రతి ఇంటికీ కేజీ బంగారం ఇస్తామంటారు. నమ్ముతారా అని శ్రీ వైయస్ జగన్ ప్రశ్నించారు. లేదంటూ ప్రజలు చేతులు ఊపారు. 

- ప్రతి ఇంటికి వచ్చి ఓటుకు మూడువేలు పెట్టే కార్యక్రమం చేస్తారు. డబ్బు ఇస్తానంటే తీసుకోండి. ఆ డబ్బు మనది. మనల్ని దోచేసి ఆ సొమ్ము చంద్రబాబు సంపాదించారు. కాబట్టి.. ఎవ్వరూ వద్దు అనొద్దు. ఖచ్చితంగా తీసుకోండి. ఆ మనిషికి ఎలా బుద్ధి చెప్పాలో.. అలా బుద్ధి చెప్పండని కోరిన శ్రీ వైయస్ జగన్. 

- చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అనే పదం రావాలి. నిజాయితీ అనే పదం రావాలి. మైక్ పట్టుకొని ఫలానా చేస్తానని రాజకీయ నాయకుడు చెబితే.. చేయకపోతే రాజీనామా చేసే పరిస్థితి రావాలి. 

- శ్రీ వైయస్ జగన్ కు తోడుగా మీరందరూ ఉన్నప్పుడు విశ్వసనీయత అన్నది సాధ్యమౌతుంది. మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయబోతున్నామో.. నవరత్నాల్లో తెలిపాం. నవరత్నాల ద్వారా ప్రతి రైతన్నలో చిరునవ్వు చూడాలని ఉందన్నారు. 

- ఇంజనీరింగ్ చదవాలంటే లక్షల్లో ఫీజులు ఉన్నాయి. చంద్రబాబు ముష్టివేస్తున్నట్లు ముప్ఫై, ముప్ఫై ఐదు వేలు ఇస్తున్నారు. 

- ముఖ్యమంత్రిగా నాన్నగారు ఉన్నప్పుడు పేదవారు ఏం చదవాలన్నా.. నేను చదివిస్తానని భరోసా ఇచ్చారు. ఇదే పెద్దమనిషి చంద్రబాబు మాత్రం ఎన్నికలప్పుడు బీసీల మీద ప్రేమ అంటారు. చంద్రబాబు నాలుగు  కత్తెరలు ఇచ్చి బీసీల మీదప్రేమ ఉంటారు. కానీ బీసీల మీద నిజమైన ప్రేమను చూపించింది ఒక్క వైయస్ఆరే. నాన్నగారు పేదవారి కోసం ఒక్కడుగు ముందుకు వేస్తే.. ఆయన కొడుకుగా నేను రెండు అడుగలు వేస్తానని శ్రీ వైయస్ జగన్ తెలిపారు. మీరు మీ పిల్లల్ని ఏం చదివిస్తారో వారికి తోడుగా నేను ఉంటానని ప్రకటించారు. పిల్లలు హాస్టల్, మెస్ ఛార్జీల కోసం ప్రతి ఏటా రూ.20వేలు ఇస్తామని ప్రకటించారు. 

- చదువుల విప్లవం తీసుకురావటానికి  పునాదులు ఈ చిట్టిపిల్లల నుంచి మొదలు అవుతాయి. 
- ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి తల్లికీ పిల్లలను బడికి పంపిస్తే రూ.15వేలు ఇస్తాం. 
- ఆ పిల్లలు చదివితేనే మన బతుకులు, మన తలరాతలు మారతాయి. 

- ప్రతి అవ్వకు,తాతకు పింఛను రూ.2వేలు ఇస్తాం. ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు పనులకు పోతే గానీ కడుపు నిండని పరిస్థితి ఉంది. పొరపాటున వారం రోజులు పనులకు పోకపోతే పస్తులు పడుకోవాల్సిన పరిస్థితి ఉంది. వారందరికీ చెబుతున్నా. పెన్షన్ రూ.2వేలు ఇవ్వటమే కాకుండా.. వయస్సు 45 ఏళ్లకే తగ్గిస్తాం.  

- మిగిలిన వారి వయస్సు 65 నుంచి 60 ఏళ్లకే పింఛను ఇస్తాం. 

- పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను చంద్రబాబు మోసం చేశారు. రైతులతో పాటు పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు అప్పుల్లో ఉన్నారు. చంద్రబాబు రాకముందు.. వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చేందుకు వారి తరుపున ప్రభుత్వం బ్యాంకులకు వడ్డీ కట్టేది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక.. ప్రభుత్వం నుంచి కట్టాల్సిన వడ్డీ డబ్బులు ఎగరకొట్టేశారు. ఎన్నికల నాటికి పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మకు ఎంత అప్పు ఉంటుందో ఆ మొత్తం నాలుగు విడతల్లో మీ చేతికే ఇస్తాం. 

- బ్యాంకులు వడ్డీ డబ్బులు కడతాం. బ్యాంకులు మీకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తాయి అని పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు హామీ ఇచ్చారు. 
- ప్రతి పేదవాడికీ మూడు సెంట్ల స్థలంలో ఇళ్లు కట్టిస్తామని చంద్రబాబు చెప్పారు. మరి, ఒక్క ఇళ్లైనా  కట్టించారా అని శ్రీ వైయస్ జగన్ ప్రశ్నించారు. 
- నాన్నగారి హయాంలో దేశంతో ఏపీ పోటీ పడింది. లక్షల్లో ఇళ్లు కట్టించిన ఘనత వైయస్ఆర్ సొంతం. 

- మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అక్కచెల్లెమ్మల పేరుమీద రిజిస్టర్ చేయిస్తాం. ఆ ఇంటిని బ్యాంకుల్లో తాకట్టు పెడితే.. పావలా వడ్డీకే రుణాలు వచ్చేలా చర్యలు తీసుకుంటాం. 

- నిన్న ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం జరిగింది. ఓ పాప వచ్చి మేం ఓసీలం.. మాకు కార్పొరేషన్ ఇస్తే.. లోన్లు వచ్చే అవకాశం మెరుగు అవుతాయని కోరింది. ఆ చిట్టితల్లి కోసం కార్పొరేషన్ అన్నది .. ఏ కులంలో పేదవాడికి అప్పులు ఇచ్చి వారు బాగుపడటానికే. ప్రతి కులానికి కార్పొరేషన్ ప్రకటిస్తూ వస్తున్నాం. ఓసీల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. కమ్మ, కులి, రెడ్డి, క్షత్రియల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. 

- ప్రతి ఒక్కరికీ తోడుగా ఉండేందుకు ప్రతి కులానికీ కార్పొరేషన్ తీసుకువచ్చి.. తోడుగా ఉంటామని శ్రీ వైయస్ జగన్ ప్రకటించారు.

Click here for Photogallery