నవ్యాంధ్రలో ప్రపంచంలోనే అతి పెద్ద రైస్ మిల్

నవ్యాంధ్రలో ప్రపంచంలోనే అతి పెద్ద రైస్ మిల్

09-02-2018

నవ్యాంధ్రలో ప్రపంచంలోనే అతి పెద్ద రైస్ మిల్

ప్రపంచంలోనే అతిపెద్ద రైస్‌ మిల్లును ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పేందుకు దుబాయ్‌కు చెందిన ఫోనిక్స్‌ సంస్థ సన్నద్దమైంది. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో మెగా ఇంటిగ్రేటెడ్‌ రైస్‌ మిల్‌ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకు సంబంధించి పనులు ఈ ఏడాది ఏప్రిల్‌లో మొదలుపెడతామని ఫోనిక్స్‌ గ్రూపు ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌, సీఈవో గౌరవ్‌ థావన్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో అన్నారు. ఈ నెలాఖరులో విశాఖలో నిర్వహించే భాగస్వామ్య సదస్సుకు వాణిజ్య, పారిశ్రామిక ప్రముఖులను ఆహ్వానించడానికి, ఆంధ్రప్రదేశ్‌కు మరింత పెట్టుబడులను ఆకర్షించేందుకు ఒకరోజు పాటు దుబాయ్‌లో పర్యటించిన ముఖ్యమంత్రితో గౌరవ్‌ థావన్‌ సమావేశమయ్యారు. మెగా ఇంటిగ్రెటెడ్‌ రైస్‌ మిల్‌ ప్రాజెక్టుపై ఇరువు చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో వ్వవసాయ రంగంలో చేపడుతున్న వినూత్న విధానాల్ని ధావన్‌కు ముఖ్యమంత్రి వివరించారు. అనంతపురం జిల్లాలో వేరుసెనగ సాగు చేపట్టేందుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని, పీనట్‌ బటర్‌ తయారీ యూనిట్‌ నెలకొల్పాలని కోరారు.