మార్చి 8న ఏపీ బడ్జెట్?

మార్చి 8న ఏపీ బడ్జెట్?

09-02-2018

మార్చి 8న ఏపీ బడ్జెట్?

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు మార్చి 5వ తేదీన ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ  మేరకు తేదీ ఖరారు చేసిందని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. మొత్తం ఇరవై పనిదినాలు సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ప్రకారం మార్చి 29వ తేదీ వరకు సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. మార్చి 8న ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి.