విభజన హామీలపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు

విభజన హామీలపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు

09-02-2018

విభజన హామీలపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు

విభజన హామీలపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తెలుగుదేశం ఎంపీ తోట నరసింహం అన్నారు. నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ చేసిన ప్రకటన అసంతృప్తికి గురిచేసిందన్నారు. జైట్లీ సమాధానం వల్ల ఆంధ్రప్రాంత ప్రజలకు కేంద్రంపై మరింత అపనమ్మకం ఏర్పడిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరచి ఏపీకి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆవేదన ఎలా ఉందన్నది ఏపీ బీజేపీ నేతలను అడిగినా చెబుతారని, ఏపీకి న్యాయం చేయాలన్నదీ తమ ప్రధాన డిమాండ్‌ అని పేర్కొన్నారు.