పొగాకు రైతులకు వైఎస్‌ జగన్‌ భరోసా

పొగాకు రైతులకు వైఎస్‌ జగన్‌ భరోసా

17-02-2018

పొగాకు రైతులకు వైఎస్‌ జగన్‌ భరోసా

వైఎస్‌ జగన్‌ ను కలిసిన పొగాకు రైతులు

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా తనను కలిసిన పొగాకు రైతులకు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి భరోసా ఇచ్చారు. రైతులకు గిట్టుబాటు ధర కోసం వైఎస్‌ఆర్‌ సీపీ పోరాటం చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.  జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ను శనివారం వీవీపాలెం పొగాకు రైతులు కలిశారు. కిలో పొగాకుకు రూ.176 ఉత్తత్పి వ్యయం అవుతుందని, కౌలు ఖర్చులు అదనంగా అవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అదనపు ఖర్చులు కూడా పెరిగిపోయాయని వాపోయారు.

కనీసం గిట్టుబాటు ధర రూ.210 ఉండాలని రైతులు కోరారు. మరో ఏడాదిలో మనందరి ప్రభుత్వం వస్తుందని, అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని జగన్‌ తెలిపారు. ఇందుకోసం రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని జననేత హామీ ఇచ్చారు. వైఎస్‌ జగన్‌ హామీతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు వలేటివారిపాలెం చేరుకున్న వైఎస్‌ జగన్‌కు స్థానికులు ఆత్మీయ స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను రాజ‌న్న బిడ్డ‌కు వివ‌రించారు.

Click here for Photogallery