కందుకూరు పట్టణంలో వైయస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర

కందుకూరు పట్టణంలో వైయస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర

18-02-2018

కందుకూరు పట్టణంలో వైయస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర

వైయస్ జగన్ ప్రసంగంలో ముఖ్యాంశాలు:

- టీడీపీకి, పవన్ కళ్యాణ్ కు శ్రీ వైయస్ జగన్ సవాల్
- అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం.
- టీడీపీ అవిశ్వాస తీర్మానం పెడతామన్నా మద్దతు ఇస్తాం. 
-మార్చి చివరి వారంలో అవిశ్వాస తీర్మానం పెడతాం.
- ఏప్రిల్ 6న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారు.
- ప్యాకేజీ అంశాన్ని పక్కన పెట్టి హోదా కోసం పోరాడాలి.
- ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీతో ఒరిగేదేమీ లేదు. 
- హోదా కోసం పోరాడాలి.

* సంవత్సరంలోపు ఎన్నికలు రాబోతున్నాయని కార్యకర్తలను చంద్రబాబు సిద్ధం చేస్తున్నారు.
* నాలుగేళ్ల బాబు పాలన మీరంతా చూసి విసిగెత్తారు. బాబు పాలనలో సంతోషంగా ఉన్నారా? అని ప్రశ్నిస్తే లేదని చేతులు ఊపిన ప్రజానీకం. చంద్రబాబు పాలనలో ఏ వర్గమూ సంతోషంగా లేదు. 

*చంద్రబాబు రైతన్నలకు రుణమాఫీ చేస్తామని వారిని మోసం చేశారు. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాలు బేషరుతుగా మాఫీ చేస్తామని మోసం చేశారు. చదువుకున్న పిల్లలు జాబు రావాలంటే బాబు పోవాలని విద్యార్థులు అంటున్నారు. 

* ఏ చదువు చదువుకోపోయినా పర్వాలేదు. ఉద్యోగం ఇస్తాం. లేకపోతే నిరుద్యోగభ)తి కింద రూ.2వేలు ఇస్తామని టీడీపీ పాంప్లెట్ ప్రతి ఇంటికీ పంచారు. 45 నెలల కాలంలో ప్రతి ఇంటికీ రూ.90వేలు చంద్రబాబు బాకీ పడ్డారు. 

* టీడీపీ ఎన్నికల ప్రణాళికలో ప్రతి కులానికీ ఓ పేజీ కేటాయించారు.

* పెట్రోల్, డీజిల్ పక్క రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలోనే ఎక్కువ. ఏ దేశంలో లేని విధంగా మన రాష్ట్రంలోనే రూ.7లు పైగా బాదుతున్నారు. 

* ఎన్నికల ముందు కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి. వస్తూనే తగ్గిస్తానన్న బాబు కరెంటు బిల్లులు షాక్ కొట్టేవిధంగా మూడు సార్లు పెంచారు. ఈ రోజు రూ. 1,000లకు పైగా బిల్లులు వస్తున్నాయి. ఎస్సీలకు గతంలో వంద రూపాయిల లోపు బిల్లులు వచ్చేవి. ఇప్పుడు కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి. 

* పండగలు వస్తే సామాన్య ప్రజలు ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే భయపడే పరిస్థితి. 

* నాలుగేళ్ల క్రితం రేషన్ షాపుల్లో రూ.185లకే పచారీ సామాన్లు ఇచ్చేవారు. ఈ రోజున బియ్యం తప్ప ఏమీ దొరకటం లేదు. ఇంట్లో కనీసం ఇద్దరికి వేలిముద్రలు పడటం లేదంటూ.. కటింగ్ పెడుతున్నారు. బియ్యం కూడా మిగిల్చుకునే కార్యక్రమం చేస్తున్నారు. 

* ఆరోగ్యం కోసం లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. 20 నిమిషాల్లో రావాల్సిన అంబులెన్స్ వస్తుందో, రాదో తెలీయని పరిస్థితి. పూర్తిగా ఆరోగ్యశ్రీని చంద్రబాబు నాశనం చేశారు. 

* నాన్నగారి హయాంలో పేదరికంలో ఉన్నా చదువుకునే పరిస్థితి. ఎంతటి ఉన్నత చదువులైనా నేనున్నా.. అంటూ వైయస్ఆర్ వెన్నుతట్టి ప్రోత్సహించారు. 

* చంద్రబాబు ఎన్నికలు వస్తే.. బీసీల మీద ప్రేమ అంట.. నాలుగు  కత్తెరలు, ఇస్త్రీపెట్టెలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. కానీ బీసీల మీద నిజమైన ప్రేమ చూపించింది నాన్నాగారే. ఇంజనీరింగ్ చదువులకు లక్ష పైనే ఖర్చుఅవుతుంటే బాబు కేవలం రూ.30, 35వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. * ఈ నాలుగు సంవత్సరాల్లో బాబు వస్తే జాబు రాలేదు కానీ ప్రకాశం జిల్లాకు కరువు వచ్చింది. 

* మొన్న ఖరీఫ్ లో 56 మండలాలకు 46 మండలాలు కరువు మండలాలు. రబీలో -71 శాతం వర్షపాతం నమోదైంది. జనవరిలోనూ ఒక్క చినుకు వర్షపాతం పడలేదు. ఖరీఫ్, రబీలో ఇంత దారుణంగా ఉంటే కరువు మండలాల ప్రకటన కూడా చంద్రబాబు ప్రభుత్వం ప్రకటన చేయలేదు. ఇంతవరకు ఇన్స్యూరెన్స్ సొమ్ము కట్టిన పాపాన పోలేదు. ఉపాధి హామీ పనుల కోసం 7 లక్షల జాబ్ కార్డ్ హాల్డర్స్ ఉంటే.. కేవలం గతఏడాది 58 రోజులు మాత్రమే ఉపాధి కల్పించారు. ఈ ఏడాది కరువు వచ్చినా 100 రజులు పనులు  కల్పించాలని ఉపాధి ఉపాధి హామీ చట్టం చెబుతున్నా.. అదీ నెరవేర్చటం లేదు. పాదయాత్రలో అక్కచెల్లెమ్మలు కలిసి రాళ్లపాడు ప్రాజెక్టు ప్రాంతంలో ఉన్నాం. మూడు నాలుగు మండలాలు అవతల వెళ్లి పనులు చేయాల్సి వస్తోందన్నారు. ఈ రాళ్లపాడు ప్రాజెక్టుకు ఈ రోజు చంద్రగ్రహణం పట్టింది. ప్రియతమ నేత వైయస్ఆర్ సోమశిల నుంచి ఉత్తరకాల్వ తీసి.. కందుకూరు, ఉదయగిరి ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని.. పనులు రూ.100 కోట్ల ఖర్చుతో మొదలుపెట్టారు. నాన్నగారి హయాంలో 80శాతం పనులు పూర్తయ్యాయి. కేవలం రూ.20 కోట్లు ఖర్చు చేస్తే పనులు పూర్తవుతాయి. చంద్రబాబు రైతులకు నీరు అందించాలన్న ధ్యాసే లేదు. బాబు ఇంత దారుణమైన పాలన సాగిస్తున్నారు.

* శెనగ, పొగాకు, కంది, మినుము ఇక్కడ ఎక్కువగా పండిస్తున్నారు. శెనగకు సంబంధించి జిల్లాలో 2లక్షల50వేల ఎకరాల్లో పంట పండిస్తే ఈ నియోజకవర్గంలో 15వేల ఎకరాల్లో పంట పండిస్తారు. క్వింటాలు ఉత్పత్తి ధర రూ.5,200 తీసుకువెళ్తే.. మార్కెట్ లో రూ.3,500-3,800 ఇవ్వటం లేదు. రైతన్నలు గిట్టుబాటు ధర రాక అల్లాడిపోతున్నారు. 

* చంద్రబాబు దళారీలకు నాయకుడు. రైతుల నుంచి తక్కువకే కొనుగోలు చేస్తాడు. హెరిటేజ్, దళారీలకు వెళ్లాక.. రేట్లు రూ.3,500 నుంచి రూ.9వేలు, పదివేలు పలుకుతాయి. ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి. 

కంది పరిస్థితి మరీ దారుణం. కందికి రూ.4,500 కనీస మద్దతు ధర ప్రకటిస్తే.. రూ.3,500 నుంచి రూ.4,000లకు కూడా అమ్ముకోలేని పరిస్థితిలో రైతన్న ఉన్నాడు. మినుములు చూసినా అంతే. మద్దతు ధర రూ.5,850 అయితే మార్కెట్ లో రైతులకు రూ.4వేలు, రూ.4,200 గిట్టుబాటు కావటం లేదు. పొగాకు రైతు అల్లాడిపోతున్నారు. నాన్నగారి హయాంలో పొగాకుకు సగటున రూ.127 లభ్యమైంది. ఆ రోజుల్లో ఎరువుల ధర తక్కువ. ఈ రోజు అన్నీ రేట్లు పెరిగిపోయాయి. ఈ రోజు రూ.116లు రాని పరిస్థితిలో రైతన్న పొగాకు పండిస్తున్నారు. బ్యారెళ్లు మీద రైతన్న ఖాళీగా వదిలేయలేరు. పదిలక్షలు మాకిస్తే.. వేరే పంటలకు వెళ్తాం అంటే పట్టించుకునే పరిస్థితి లేదు. పొగాకు రైతులు ఆత్మహత్య చేసుకుంటే నేనే స్వయంగా వచ్చి పరామర్శించాను. చంద్రబాబు అన్యాయమైన పాలన జరుగుతోంది. ఇదే పెద్ద మనిషి.. డ్రామా ఆర్టిస్టుగా అయిపోయాడు. గత 15 రోజులుగా డ్రామాలు కనిపిస్తున్నాయి. చంద్రబాుబ ఎల్లోమీడియా పేపర్లు తిరగేస్తే.. రసవత్తరంగా డ్రామాలు కనిపిస్తున్నాయి. ఎంత రసవత్తరంగా డ్రామాలు  జరుగుతున్నాయో మీ అందరికీ తెల్సు.

ఈ డ్రామాలు ఒకస్థాయి దాటి రెండో స్థాయికి వెళ్లిపోయారు. నాలుగేళ్లుగా బీజేపీతో సంసారం చేస్తారు. కేంద్రంలో తన ఎంపీలను మంత్రులుగా పెడతారు. ఆ కేంద్ర మంత్రులు బడ్జెట్ ఆమోదం తెలుపుతారు. దాన్ని పార్లమెంట్ లో ప్రవేశపెడతారు. గతంలో ఇదే చంద్రబాబు బడ్జెట్ ఎలా పొగుడుతారో చూడండి. ఈనాడులో జనవరి 27, 2017లో మనమే ఎక్కువ సాధించామని .. ఏ రాష్ట్రానికి ఇంతకంటే ఎక్కువ సాధించారా? ప్రతి పక్షాలకు చంద్రబాబు సవాల్ అంటూ.. కథనం ప్రచురితం అయింది. 2014-15, 2015-16, 2016-17 మూడు సంవత్సరాలు బ్రహ్మాండంగా చేశారని సర్టిఫికెట్ ఇవ్వటమే అని శ్రీ జగన్ స్పష్టం చేశారు. అంటే.. 2018 బడ్జెట్ కు చంద్రబాబు ఆమోదం తెలిపినట్లే కదా అని నిలదీశారు. రాష్ట్రానికి అరుణ్ జైట్లీకి ఏమీ చేయకపోయినా శాలువాలు కప్పి.. వాళ్లు చంద్రాబుకు క్యాబేజీలు పెడితే పెట్టించుకొని మన చెవుల్లో పూలు పెడుతున్నారు. సంవత్సరంలో ఎన్నికలు జరగబోతున్నాయని బీజేపీ, కేంద్ర ప్రభుత్వం మీద నిందలు వేయటం మొదలుపెట్టారు. చంద్రబాబు ఒకసారి అన్నీ చేశారని .. ఇంకోసారి ఏమీ చేయలేదంటారు.

చంద్రబాబు తానాతందాన అంటే.. తందాన చెప్పటానికి ఆయన పార్టీకి చెందిన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉన్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జాయింట్ ఫ్యాక్ట్ కమిటీ అనేది ఏర్పాటు చేస్తారట. కేంద్రం ఎంత ఇచ్చింది.. రాష్ట్రం ఎంత ఇచ్చిందో.. నిజనిర్ధారణ చేస్తారట.నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒకవైపు..బీజేపీ దండిగా ఇచ్చిందని చంద్రబాబు చెబితే.. ఎన్నికలు వస్తే.. ఆయన ప్లేటు మారిస్తే.. ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి.. వాళ్లు ఏం ఇచ్చారు.. వీళ్లు ఏం తీసుకున్నారో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చేస్తారట. ఇది కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లు ఉంది. అయ్యా.. మీరు.. చేయాల్సింది.. కోడిగుడ్డు మీద ఈకలు పీకటం కాదు.. ప్రత్యేక హోదా మా హక్కు అని పోరాడాలని పవన్ కళ్యాణ్ కు తెలిపారు. ప్రత్యేక హోదా వస్తే.. జీఎస్టీ, ఇన్ కం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు.  చంద్రబాబు దగ్గర ఉండి ప్యాకేజీకి తాకట్టు పెట్టేశారు. ప్రత్యేక హక్కుకు సమానంగా ప్యాకేజీ ఇచ్చేశామని బీజేపీలు చెబుతున్నారు. ఆ రోజున రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు.. మీ వెంకయ్య నాయుడు రాజ్యసభలో ఏం మాట్లాడారో ఓసారి గుర్తు చేసుకోండని అన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు పరిశ్రమలు పెట్టడానికి ఐదు సంవత్సరాలు సరిపోదు.. పది సంవత్సరాలు ఇస్తామని వెంకయ్యనాయుడు అన్నారు. తిరుపతిలో చంద్రబాబు పది సంవత్సరాలు కాదు.. పదిహేనేళ్లు తెస్తామన్నారు. హోదాతో పాటు వచ్చే పరిశ్రమలతో పాటు వచ్చే పారిశ్రామిక రాయితీలని ఆరోజున చెప్పారు. ఈ రోజున ప్రత్యేక ప్యాకేజీ, హోదా ఒకటే అని చెబుతున్నారు. మరి, ప్యాకేజీలో ఎక్కడ జీఎస్టీ, కట్టాల్సిన పనిలేదని ఉందో చెప్పాలన్నారు. జీఎస్టీ కట్టాల్సిన పనిలేదంటే..ఎవరైనా పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వస్తారు.

ఈ రోజున చంద్రబాబు ఇవన్నీ లేవని తెల్సినా.. ప్రత్యేక హోదా.. ప్యాకేజీ ఒకటే అని విడిచిపెట్టా.. అనటంపై శ్రీ జగన్ మండిపడ్డారు. సిగ్గులేకుండా ఎలా విడిచిపెట్టావు బాబూ అని నిలదీశారు. ప్రత్యేక హోదా కోసం పోరాడాలని గట్టిగా అడిగాం. ప్రత్యేక హోదాతో చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం వస్తుందని.. ప్రత్యేక హోదా రావాలని మార్చి 5 పార్లమెంట్ సమావేశాలు మొదలు అవుతాయని మార్చి 1న కలెక్టరేట్ల దిగ్భందానికి పిలుపుఇచ్చాం. మార్చి 3న ఢిల్లీకి పార్టీ నేతలు వెళ్లటానికి పాదయాత్ర చేసే చోట నుంచి యాత్రను ప్రారంభిస్తాను. మార్చి 5న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఢిల్లీ నడిబొడ్డున కూర్చొని  కేంద్రంపై ఒత్తిడి తెస్తారు. పార్లమెంట్ సమావేశాల్లో మన ఎంపీలు పోరాటం చేస్తారు. హాదాపై ప్రకటన రాని మరుక్షణం పార్లమెంట్ సమావేశాల చివరి రోజున మన ఎంపీలు రాజీనామాలు వాళ్ల మొహాన కొట్టి వస్తారు. 

* ఇన్నాళ్లూ చంద్రబాబు చేసిన మోసం సరిచేసుకోండి. మొత్తం 25 మంది ఎంపీలు రాజీనామాలు చేయండని పిలుపునిచ్చాం. ఇంతవరకు చంద్రబాబు ప్రత్యేక హోదా గురించి ఒక్క మాట మాట్లాడడు. లీకులు ఇచ్చుకుంటూ పోతాడు. రాజీనామా అంశాన్ని పక్కన పెట్టి.. పవన్ కళ్యాణ్ అనే పార్టనర్ ఉన్నారు. చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై అవిశ్వాసం తీర్మానం పెట్టండని పవన్ అంటారు. 

* పవన్ నువ్వు ఏ ఉద్దేశంతో చెబుతున్నా పర్వాలేదు. ప్రత్యేక హోదాతో కోసం అవిశ్వాస తీర్మానం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతుంది. చివరి వారంలో అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెడతాం. ఇదే పవన్ కళ్యాణ్.. గారికి చెబుతున్నాం. మీరు కోరినట్లే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాం. అవిశ్వాస తీర్మానం ఆమోదించాలంటే.. 50 మంది ఎంపీలు కావాలి. నా పార్టీ తరుపున 5 మంది ఎంపీలు రెడీగా ఉన్నారు. మిగిలిన వారిని చంద్రబాబు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశారు. మీరు కానీ, చంద్రబాబు కానీ ప్యాకేజీతో రాష్ట్ర ప్రజలను మోసం చేయెద్దని ఇద్దరికీ చెబుతున్నా. 

* చంద్రబాబుకు జ్ఞానోదయం చేయండి. గతంలో బీజేపీ రూపాయి, అర్థరూపాయి తక్కువ అంశం పక్కనపెట్టి.. ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేద్దాం. 

* రాజకీయాల్లో మూడు నాలుగు గుణాలు ఉండాలి. విశ్వసనీయత, నిజాయితీ, కమిట్మెంట్ ఖచ్చితంగా ఉండాలి. ఇవేమీ లేకపోతే వాళ్లంతా చంద్రబాబులా తయారు అవుతారు. 

* వెన్నుపోటు, మోసాలు, అబద్ధాలు, వ్యవస్థలను మ్యానేజ్ చేయటంలో బాబు జీవితం అంతా గడిపేస్తున్నారు. 

* నాలుగు సంవత్సరాల చంద్రబాబు పాలనలో మద్యం నుంచి ఇసుక వరకు, ఇసుక నుంచి కాంట్రాక్టర్లు, కాంట్రాక్టర్ల నుంచి బొగ్గు వరకు, బొగ్గు నుంచి రాజధాని వరకు, రాజధాని నుంచి గుడి భూములు వరకు చంద్రబాబు తినేస్తున్నారు. కిందేమో జన్మభూమి కమిటీలు అవినీతి చేస్తున్నాయి. రాష్ట్రంలో అవినీతి పాలన జరుగుతోంది. 

* రాజ్యాంగం తూట్లు పొడుస్తున్నారు. అసెంబ్లీలో చట్టాల్ని తయారు చేయటం కనిపిస్తుంది. ఈ రోజు చట్టసభల్లో చట్టాల్ని తూట్లు పొడుతున్నారు.

* ఎమ్మెల్యేలను రూ.20-25 కోట్లతో కొనుగోలు చేశారు. వాళ్లపై అనర్హత వేటు వేయరు. మంత్రులుగా కొనసాగిస్తారు. చంద్రబాబు తీసుకున్న నలుగురు ఏ పార్టీకి చెందినవారు చంద్రబాబూ.. అని శ్రీ వైయస్ జగన్ నిలదీశారు. 

* మోసాలు, అబద్ధాలతో చంద్రబాబు పాలన చేస్తున్నారు. 

* మీరు చిన్నచిన్న మోసాలకు మోసపోరని.. బంగారం, కారు ఇస్తామంటారు. నమ్మరని మూడు వేలు ఇస్తారు. అది మన డబ్బే. మన దగ్గర దోచుకున్న డబ్బే. ఓటు మాత్రం మనసాక్షి ప్రకారం వేయండని శ్రీ వైయస్ జగన్ పిలుపు ఇచ్చారు. 

- నవరత్నాల్లో ఆరోగ్యంపై ప్రసంగించిన శ్రీ వైయస్ జగన్

ఆరోగ్యశ్రీలో మార్పులు తెస్తాం. దేశంలో ఎక్కడైనా సరే.. చికిత్స పొందేలా వీలు కల్పిస్తాం. పేదరోగికి శస్త్ర చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు విశ్రాంతి పొందే రోజుల్లో డబ్బులు ఇస్తాం. తలసీమియా, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారికి రూ.10 వేలు పింఛను ఇస్తాం అని ప్రకటించారు. ఈ సందర్భంగా నవరత్నాల్లో ఏవైనామార్పులు చేర్పులు ఉంటే తనను కలిసి చెప్పాలని కోరారు. ప్రకాశం జిల్లాలో రామాయపట్టణం పూర్తి చేస్తామని శ్రీ వైయస్ జగన్ హామీ ఇచ్చారు. రాళ్లపాడు ప్రాజెక్టును ఆరు నెలల్లో పూర్తి చేస్తామని శ్రీ వైయస్ జగన్ ప్రకటన చేశారు.