ఏపీలో బీజేపీ మంత్రుల రాజీనామా
Sailaja Reddy Alluddu

ఏపీలో బీజేపీ మంత్రుల రాజీనామా

08-03-2018

ఏపీలో బీజేపీ మంత్రుల రాజీనామా

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బీజేపీ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసిన మంత్రులు కామినేని, మాణిక్యాలరావు తమ రాజీనామా లేఖలను అందజేశారు. మంత్రులుగా అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబుకు కామినేని, మాణిక్యాలరావు కృతజ్ఞతలు తెలిపారు.

మంత్రులుగా ఎంతో బాధ్యతగా వ్యవహరించారని, విలువలకు కట్టుబడి పనిచేశారని ఈ సందర్భంగా చంద్రబాబు కొనియాడారు. కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలుగుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో రాష్ట్రంలోని బీజేపీ మంత్రులు రాజీనామా చేయాల్సిందిగా అధిష్టానం నుంచి ఆదేశాలు రావడంతో మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు.