2019లో అధికారం మాదే
Nela Ticket
Kizen
APEDB

2019లో అధికారం మాదే

20-04-2017

2019లో అధికారం మాదే

2019 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపడుతుందని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ నిర్మించిన వాటికే  మంత్రి కేటీఆర్‌ ప్రారంభోత్సవాలు చేస్తూ గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. మిషన్‌ భగీరథ పేరుతో నగర శివారులో కేటీఆర్‌ ప్రారంభించిన రిజర్వాయర్లన్నీ కాంగ్రెస్‌ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులేనన్నారు. ప్రస్తుత రిజర్వాయర్లకు తాగునీటి పథకం కింద మూడేళ్ల క్రితమే నిధులు కేటాయించి పనులు ప్రారంభించామని, ఆ నిధులతోనే వాటిని పూర్తిచేసి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని ఆక్షేపించారు. మిషన్‌ భగీరథ పేరుతో కమీషన్లు కొట్టేస్తున్నారనీ, కాంగ్రెస్‌కు పేరు రాకుడదనే దురుద్దేశంతో పథకాల పేర్లు సైతం మారుస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్‌ మంత్రి హరీశ్‌రావు ఏకాకి అవుతారని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు చూసి కేసీఆర్‌ నేర్చుకోవాలని సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోయినా స్పెషల్‌ ప్యాకేజీ తెచ్చుకున్నారని గుర్తు చేశారు.