హైదరాబాద్ లో ఏప్రిల్‌ 28న అంతర్జాతీయ పాలీమర్ సదస్సు
APEDB
Ramakrishna

హైదరాబాద్ లో ఏప్రిల్‌ 28న అంతర్జాతీయ పాలీమర్ సదస్సు

21-04-2017

హైదరాబాద్ లో ఏప్రిల్‌ 28న అంతర్జాతీయ పాలీమర్ సదస్సు

ఈ నెల 28న హైదరాబాద్‌లోని హెచ్‌ఐసిసిలో రెండో విడత అంతర్జాతీయ పాలీమర్‌ సదస్సును నిర్వహించనున్నట్లు తెలంగాణ, ఆంధ్ర ప్లాస్టిక్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ (తాప్మా) అధ్యక్షుడు వేణుగోపాల్‌ జాస్తి తెలిపారు. మన దేశం నుంచే కాకుండా జర్మనీ, దుబాయ్‌, సింగపూర్‌, కొరియా, చైనా దేశాల నుంచి చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమలకు చెందిన దాదాపు 600 మంది సభ్యులు పాల్గొనన్నుట్లు తెలిపారు. ప్లాస్టిక్‌ పరిశ్రమలు పాలీమర్లకు సంబంధించిన అనేక రకాల మెటీరియల్స్‌ను తయారు చేస్తూ పరిశ్రమలకు సేవలు అందిస్తున్నట్తు తెలిపారు. వీటిలో బిల్డింగ్‌, కన్‌స్ట్రక్షన్‌, అగ్రికల్చర్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఏరోస్పేస్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌,  ప్యాకేజింగ్‌, హేల్త్‌కేర్‌ వంటి రంగాలున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు చేపట్టిన పలు పారిశ్రామిక అనుకూల చర్యల వల్ల రానున్న కాలంలో ఈ పరిశ్రమ మరింత వృద్ధి చెందే అవకాశం ఉందని చెప్పారు.