అధ్యక్షుడిగా సీం కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక
Nela Ticket
Kizen
APEDB

అధ్యక్షుడిగా సీం కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక

21-04-2017

అధ్యక్షుడిగా సీం కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి, ప్రస్తుత అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణల తర్వాత ఒకే ఒక్క నామినేషన్‌ దాఖలైన నేపథ్యంలో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఎన్నికల వివరాలను అధికారికంగా ప్రకటించారు. ఎన్నికల వివరాలను ప్రకటించిన సందర్భంగా నాయిని మాట్లాడుతూ ప్రజలందరూ కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లు సృష్టం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌ వద్ద టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు బాణాసంచాలు పేల్చి, స్వీట్లు పంచుకున్నారు.