ఘనంగా టీఆర్ఎస్ ప్లీనరీ
Nela Ticket
Kizen
APEDB

ఘనంగా టీఆర్ఎస్ ప్లీనరీ

21-04-2017

ఘనంగా టీఆర్ఎస్ ప్లీనరీ

హైదరాబాద్‌ నగర శివారులోని కొంపల్లిలో టీఆర్‌ఎస్‌ ప్లీనరీ అట్టహాసంగా ప్రారంభమైంది. తెలంగాణ ప్రగతి ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలో ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ పార్టీ జెండాను ఎగురవేసి ప్లీనరీని ప్రారంభించారు. గులాబీ పార్టీ పదహారేళ్ల పండుగకు రాష్ట్రవ్యాప్తంగా ఆ  పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. నేతల ఆత్మీయ పలకరింపులు, సెల్ఫీలతో సభాప్రాంగణమంతా కోలాహలంగా మారింది. గులాబీ దళపతిగా తిరిగి పగ్గాలు అందుకున్న తమ అధినేత కేసీఆర్‌కు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభినందనలు తెలిపారు.