అందుకే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా
Sailaja Reddy Alluddu

అందుకే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా

09-07-2018

అందుకే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా

చేయాలనుకున్న పనులు చేయలేకపోతున్నానని అందుకే పొలిటికల్‌ రిటైర్‌మెంట్‌ తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చానని టీఎస్‌ ఆర్‌టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రామగుండం మేయర్‌ అవిశ్వాస పరిణామాలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ తనకు సహరించిన సింగరేణి కార్మికులు, రామగుండం ప్రజలకు ఆయన కృతజ్జతలు తెలిపారు. ఈ రోజు సింగరేణి కార్మికులతో భేటీ అయిన ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌లో తనకు గౌరవం లేదని అన్నారు. పార్టీలో అవినీతిపరులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్‌లో రాజకీయ సన్యాసం  తీసుకుంటానని తెలిపారు. ఆర్టీసీ చైర్మన్‌ పదవి ఇచ్చినా అధికారాలు ఇవ్వలేదని అన్నారు. పార్టీలో క్రమశిక్షణ లోపించిందని వ్యాఖ్యానించారు. పదవుల్లో ఉంటానని, విధులకు హాజరుకానని సృష్టం చేశారు.