స్వామి పరిపూర్ణానంద హౌస్ అరెస్ట్

స్వామి పరిపూర్ణానంద హౌస్ అరెస్ట్

09-07-2018

స్వామి పరిపూర్ణానంద హౌస్ అరెస్ట్

శ్రీరాముడిపై కత్తిమహేష్‌ వ్యాఖ్యలకు నిరసనగా ధర్మాగ్రహ యాత్ర తలపెట్టిన స్వామి పరిపూర్ణానందను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. జూబ్లీహిల్స్‌లోని స్వామీజీ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. శ్రీరాముడిపై కత్తిమహేష్‌ వ్యాఖ్యలకు నిరసనగా యాదాద్రి వరకు స్వామి పరిపూర్ణానంద ధర్మాగ్రహ యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. కాగా ఈ యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. మరోవైపు యాత్ర కోసం వేలాది మంది హిందువులు యాదాద్రికి తరలివస్తున్నారు. ఈ క్రవంలో ఎలాంటి సంఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు పరిపూర్ణానందను గృహనిర్భందం చేశారు.