ఆగస్టు 1 నుంచి రెరా అమలు

ఆగస్టు 1 నుంచి రెరా అమలు

10-07-2018

ఆగస్టు 1 నుంచి రెరా అమలు

తెలంగాణ రాష్ట్రంలో స్థిరాస్తి నియంత్రణ చట్టం (రెరా) అమలుకు రంగం సిద్ధమవుతోంది. ఆగస్టు 1 నుంచి రెరా కార్యక్రమాలు ప్రారంభించడానికి పురపాలకశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ చట్టం పరిధిలో కీలకమైన వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురానుంది ఆ వెంటనే రెరా పనిచేయడం ప్రారంభమైనట్లే అని పురపాలకశాఖ ఉన్నతాధికారులు సృష్టం చేశారు. గత ఏడాది ఆగస్టు 4 నుంచి రాష్ట్రంలో రెరా నిబంధనలు అమల్లోకి వచ్చినా అథారిటీ ఏర్పాటు, వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురాకపోవడంతో 11 నెలలుగా చట్టం అమల్లోకి రాలేదు. దీనిపై కసరత్తు ప్రారంభించిన పురపాలకశాఖ వెబ్‌సైట్‌ రూపకల్పనకు మహారాష్ట్ర ప్రభుత్వం-టీసీఎస్‌ సంయుక్త సంస్థ అయిన మహా ఆన్‌లైన్‌ సేవల్ని వినియోగించుకుంటోంది. ఆ సంస్థ అక్కడ ఒక వెబ్‌సైట్‌ను విజయవంతంగా నిర్వహిస్తోంది.