హైదరాబాద్ కు అమిత్ షా

హైదరాబాద్ కు అమిత్ షా

12-07-2018

హైదరాబాద్ కు అమిత్ షా

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా రేపు హైదరాబాద్‌కు రానున్నారు. ఈ క్రమంలో అమిత్‌ షా పర్యటనను విజయవంతం చేసేందుకు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. 5 వేల మందితో బైక్‌ ర్యాలీ నిర్వహించనున్నట్లు బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు తెలిపారు. రేపు ఉదయం ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలతో అమిత్‌ షా సమావేశమవుతారని చెప్పారు. ఎలక్షన్‌ మేనేజ్‌మెంట్‌, కోర్‌ కమిటీ, కార్యకర్తల సమావేశాలలో అమిత్‌ షా పాల్గొంటారని తెలిపారు. కార్యకర్తలకు అమిత్‌షా దిశానిర్ధేశం చేస్తారని పేర్కొన్నారు.