తెలంగాణ అసెంబ్లీ రద్దుకు గవర్నర్ ఆమోదం

తెలంగాణ అసెంబ్లీ రద్దుకు గవర్నర్ ఆమోదం

06-09-2018

తెలంగాణ అసెంబ్లీ రద్దుకు గవర్నర్ ఆమోదం

తెలంగాణ అసెంబ్లీ రద్దు తీర్మానానికి గవర్నర్‌ ఆమోదం తెలిపారు. ఈ మేరకు రాజ్‌భవన్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ను ఈసీ, అసెంబ్లీ కార్యదర్శికి రాజ్‌భవన్‌ వర్గాలు పంపాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారికంగా రద్దయింది. ఇదిలా ఉంటే, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కేసీఆర్‌ను గవర్నర్‌ కోరారు. ఇందుకు కేసీఆర్‌ కూడా సుముఖత వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌, మంత్రులు కొనసాగాలని జీవో నెంబర్‌ 134ను సీస్‌ ఎస్కే జోషి జారీ చేశారు.