కాంగ్రెస్ లో చేరిన కొండా దంపతులు

కాంగ్రెస్ లో చేరిన కొండా దంపతులు

26-09-2018

కాంగ్రెస్ లో చేరిన కొండా దంపతులు

వరంగల్‌ తూర్పు నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ దంపతులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమక్షంలో కొండా సురేఖ, కొండా మురళీ కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ, రేణుకాచౌదరి వంటి నేతలు దగ్గరుండి కొండా దంపతులను పార్టీలోకి ఆహ్వానించారు. కొండా దంపతులకు రెండు, మూడు సీట్లు కాకుండా ఒక్క సీటును మాత్రమే కేటాయించేందుకు అధిష్ఠానం సముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఐదు స్థానాలను ప్రభావితం చేయగల కొండా దంపతులు తిరిగి సొంత గూటికి చేరడంతో కాంగ్రెస్‌ పార్టీలో ఉత్సాహం నెలకొంది.