టీఆర్ఎస్ కు తలనొప్పిగా మారిన ఖైరతాబాద్

టీఆర్ఎస్ కు తలనొప్పిగా మారిన ఖైరతాబాద్

19-10-2018

టీఆర్ఎస్ కు తలనొప్పిగా మారిన ఖైరతాబాద్

అధికార టీఆర్‌ఎస్‌కు ఈసారి ఖైరతాబాద్‌ టికెట్‌ కేటాయింపు తలనొప్పిగా మారే అవకాశాలు కన్పిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కనీసం జై తెలంగాణ అనే నినాదం కూడా చేయని మాజీ మంత్రి దానం నాగేందర్‌ ఇటీవలే కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరి, టికెట్‌ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే! ఉద్యమ సమయంలో తెలంగాణ విద్యార్థులపై దాడులు చేయించిన దానం నాగేందర్‌కు టికెట్‌ కేటాయిస్తే తాము పనిచేసేందుకు సిద్ధంగా లేమని ఇప్పటికే ఖైరతాబాద్‌ శ్రేణులు అధినేతకు తెల్చిచెప్పినట్లు సమాచారం. చివరి నిమిషంలో నాగేందర్‌ను బరిలో దింపితే, ప్రస్తుతం టికెట్‌ ఆశిస్తున్న వారు ఓ నిర్ణయానికి వచ్చి, వారిలో ఒకరు స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగుతామని కూడా స్పష్టం చేయటంతో ఈ సీటు కేటాయింపుపై పార్టీ పెద్దలు ఏమి చేయాలో తోచక తలలు పట్టుకుంటున్నారు. ఏదో విధంగా అసంతృప్తి నాయకులను తృప్తిపరిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.