సోషల్ మీడియా ప్రచారంపై టీఆర్ఎస్ దృష్టి

సోషల్ మీడియా ప్రచారంపై టీఆర్ఎస్ దృష్టి

27-10-2018

సోషల్ మీడియా ప్రచారంపై టీఆర్ఎస్ దృష్టి

త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సోషల్‌ మీడియాను విరివిగా వినియోగించుకోవాలని అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ నిర్ణయించుకుంది. ఈ సామాజిక మాధ్యమాల్లో ప్రచారానికి మంత్రి కేటీఆర్‌ కూడా అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. ఇటీవల టూరిజం ప్లాజాలో సోషల్‌మీడియా విభాగం సమావేశం కూడా నిర్వహించగా, ఎంపీ కల్వకుంట్ల కవితను సామాజిక మాధ్యమ సారధిగా ప్రకటించారు. ఆమె విసృతంగా వాట్సాప్‌ గ్రూపులు ఏర్పరిచి వ్యూ హాత్మకంగా వ్యవరిస్తున్నారు. తాజాగా రెండు రోజుల క్రితం ప్రగతిభవన్‌లో సోషల్‌మీడియా ముఖ్య బాధ్యులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసిన కేటీఆర్‌ ఇటీవల కాలంలో విపక్షం సామాజిక మాధ్యమాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నందున వీటిని ఎలా తిప్పికొట్టాలో సూచనలు చేసినట్లు తెలిసింది. అశ్లీలతకు తావులేకుండా ఆలోచనతోనే కౌంటర్లు వేయాలని, గణాంకాలు సిద్దం చేసి పెట్టుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఎప్పటికపుడు అప్రమత్తంగా ఉండాలని, జరుగుతున్న పరిణామాలను గమనించాలని చెప్పినట్లు తెలుస్తోంది.

సామాజిక మాధ్యమ ప్రచారంపై టిఆర్‌ఎస్‌ ప్రత్యేక శ్రద్దతో ఉన్నట్లు తాజా అడుగులు స్పష్టం చేస్తున్నాయి. తొలి నాలుగేళ్ళు టిఆర్‌ఎస్‌కు సామాజిక మాధ్యమాల్లో ఏకపక్ష మద్దతు లభించగా, గత నాలుగైదు మాసాల్లో అదే స్థాయిలో ప్రతికూల పోస్టింగ్‌లు, వీడియోలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. తెలంగాణలో ఉన్న సామాజిక, సాంస్కతిక పరిస్థితుల దష్ట్యా ప్రచారం విషయంలో అత్యంత జాగరూకతతో వ్యవహరించేందుకు టీఆర్‌ఎస్‌ పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తోంది.

ఇప్ప్టటకే ప్రచారానికి టీఆర్‌ఎస్‌ లక్ష వీడియోలను సిద్ధం చేసింది. పథకాలపై ప్రచారం, వాటి ప్రభావం, ప్రభుత్వ పథకాలపై ప్రముఖుల ప్రశంసలు, విపక్ష నేతలు, కేంద్రమంత్రుల ప్రశంసలు, లబ్దిదారుల ఆశీర్వాదాలు అన్నింటినీ సామాజిక మాధ్యమాల్లో విసృతంగా ప్రచారం చేసేందుకు టీఆర్‌ఎస్‌ ముఖ్యులు అంతా సిద్ధం చేసి పెట్టారు. ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వివిధ వెబ్‌ఛానళ్ళ వీడియోలను తరచూ ప్రస్తావిస్తున్న టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ వంటి మాధ్యమాల్లో యువత, సామాన్యులను ఆకట్టుకునేలా తక్కువ నిడివిగల వీడియోలను తయారు చేయమని ఆదేశించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే దాదాపు లక్ష వీడియోలను సిద్ధం చేయగా, విపక్షాన్ని కౌంటర్‌ చేసే, ఆత్మరక్షణలో పడేసే అనేక వీడియోలు ఇందులో ఉన్నట్లు చెబుతున్నారు.

పథకాల ప్రచారం, పాటలు మాత్రమే కాకుండా సూటిగా, హదయాలను తాకేలా, ఔను నిజమనిపించేలా ఉండే వీడియోలకే ఓటేసి నవంబర్‌ 1నుండి సామాజిక మాధ్యమాల్లో గిరికీలు కొట్టించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని వీడియోలను సామాజిక సైనికులు, టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా విభాగ నేతలు తమకు తోచిన రీతిలో విస్త తంగా అందిస్తున్నా సరైన కంటెంట్‌తో వీటిని విస్తతపరచాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. అందులో భాగంగా ఎప్పటికపుడు కొత్తవీడియోలను అప్‌లోడ్‌ చేస్తూ.. సామాజిక సైనికులకు కావాల్సినంత కంటెంట్‌ అందించబోతున్నట్లు తెలుస్తోంది. సామాజిక మాధ్యమ సారధిగా ఉన్న ఎంపీ కవిత ప్రచార ఉధతికి పలు ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది.