రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈస్ట్ ఎక్స్ లెన్స్ అవార్డులు

రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈస్ట్ ఎక్స్ లెన్స్ అవార్డులు

31-10-2018

రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈస్ట్ ఎక్స్ లెన్స్ అవార్డులు

హైదరాబాద్‌, సికిందరాబాద్‌ జంట నగరాల్లో ఉన్న క్లబ్‌లలో రోటరీ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ ఈస్ట్‌ వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి ఎక్స్‌లెన్స్‌ అవార్డులను కూడా బహుకరిస్తోంది. అక్టోబర్‌ 29వ తేదీన జరిగిన కార్యక్రమంలో అపోలో హాస్పిటల్‌ న్యూరో సర్జన్‌ డాక్టర్‌ అలోక్‌ రంజన్‌, బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ బి. సాయి ప్రణీత్‌ను ఎక్స్‌లెన్స్‌ అవార్డుతో సత్కరించింది. ఈ సందర్భంగా రోటరీ డిస్ట్రిక్ట్‌ 3150 డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌, రొటేరియన్‌ రమేష్‌ వంగల మాట్లాడుతూ, హైదరాబాద్‌ ఈస్ట్‌ రోటరీ క్లబ్‌ చేస్తున్న సేవలు ప్రశంసనీయని అన్నారు. రోటరీ క్లబ్‌ తన నిధులతో అభివృద్ధిపరచిన శంకరపల్లిలోని కస్తూరిబాయి బాలికల విద్యాలయను ఆయన రొటేరియన్‌లతో కలిసి చూశారు. దాదాపు 1,50,000 రూపాయల విలువైన డైనింగ్‌ టేబుళ్ళను, బెంచీలను, గ్రైండింగ్‌ మెషిన్‌తోపాటు వంటకు కావాల్సిన పాత్రలను రోటరీ క్లబ్‌ అందజేసింది.

ప్రెసిడెంట్‌ మల్లిక్‌ పొందూరి, సెక్రటరీ శ్రీనివాస్‌ చామర్తితోపాటు రొటేరియన్‌లు వి. జవహర్‌, ఎం. సురేంద్రనాథ్‌, సి.వి. సుబ్బారావు, కె. భాస్కర్‌ రెడ్డి, ఎస్‌. సత్యనారాయణ, డా. శిరీష, వైవి గిరి తదితరులు స్కూల్‌కు వెళ్లి అసభ్య దూషణల నుంచి ఎలా రక్షించుకోవాలో వివరించే పుస్తకాలను అందజేసి బాలికలను చైతన్యపరిచారు. రోటరీ క్లబ్‌ చేస్తున్న సేవలను అక్కడి ప్రముఖులు ప్రశంసించారు.

Click here for Photoglalery