కూకట్ పల్లి నుంచి రాములమ్మ పోటీ!

కూకట్ పల్లి నుంచి రాములమ్మ పోటీ!

05-11-2018

కూకట్ పల్లి నుంచి రాములమ్మ పోటీ!

కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ కాంపెయినర్‌ విజయశాంతి పోటీ ఆసక్తి రేపుతోంది. నిన్న మొన్నటి వరకు ప్రచారానికే పరిమితం కావాలని నిర్ణయించుకున్న విజయశాంతి ఇప్పుడు పోటీకి సై అంటున్నారు. టీఆర్‌ఎస్‌పై నిప్పు రవ్వలు రాజేస్తున్న రాములమ్మ  ఈ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. మెదక్‌ లేదా దుబ్బాక నుంచి పోటీకి దిగేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం సాగుతున్న తరుణంలో ఆమె గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని కూకట్‌పల్లి నుంచి బరిలోకి దిగాలని నిర్ణయించినట్లు ఆమెకు అత్యంత సన్నిహితంగా ఉన్న నేతలు చెబుతున్నారు. సీమాంధ్ర ఓటర్లు అత్యధికంగా ఉన్న కూకట్‌పల్లి నుంచి పోటీకి దిగి తన బలాన్ని నిరూపించుకోవాలని కాంగ్రెస్‌తో పాటు విజయశాంతి భావిస్తుండగా అందుకు అధినాయకత్వం కూడా పచ్చజెండా ఊపినట్లు ఆ పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే కూకట్‌పల్లి నియోజకవర్గాన్ని టీడీపీ కోరుతున్న విషయం విదితమే.