ఎన్నికల్లో పోటీకి రమణ దూరం

ఎన్నికల్లో పోటీకి రమణ దూరం

06-11-2018

ఎన్నికల్లో పోటీకి రమణ దూరం

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్‌.రమణ తప్పుకొన్నారు. రాష్ట్రంలో మహాకూటమిని ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించిన ఆయన, ఇకనుంచి కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం చేయబోతున్నారు. జగిత్యాల కాంగ్రెస్‌ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డికి అండగా నిలిచారు. 1994లో తొలిసారిగా జగిత్యాల నుంచి టీడీపీ తరపున బరిలోకి దిగి గెలిచిన రమణ, అక్కడ నుంచి ఐదుసార్లు పోటీ చేశారు. 1994లో మంత్రిగా పనిచేశారు. మహాకూటమికి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమని రమణ తెలిపారు.