నామినేషన్ దాఖలు చేసిన సీఎం కేసీఆర్

నామినేషన్ దాఖలు చేసిన సీఎం కేసీఆర్

14-11-2018

నామినేషన్ దాఖలు చేసిన సీఎం కేసీఆర్

గజ్వేల్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా  ముఖ్యమంత్రి కేసీఆర్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. గజ్వేల్‌ ఆర్డీవో కార్యాలయంలో సీఎం తన నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి అందజేశారు. అనుకున్న సమయానికి ముహూర్తం ప్రకారం 2:34 గంటలకు ఎలాంటి ఆర్భాటాలు లేకుండా కొద్దిమంది అనుచరులతో కలిసి వచ్చిన సీఎం తన నామినేషన్‌ను అందజేశారు. అంతకుక్రితం కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన సంగతి తెలిసిందే.