19 నుంచి సీఎం కేసీఆర్ సభలు

19 నుంచి సీఎం కేసీఆర్ సభలు

16-11-2018

19 నుంచి సీఎం కేసీఆర్ సభలు

టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికల ప్రచార సభలు శాసనసభ నియోజకవర్గాల వారీగా ఈ నెల 19న ప్రారంభం కానున్నాయి. అదేరోజున నామినేషన్ల గడువు ముగియనుండటంతో ఆ రోజు నుంచి ప్రచారవేగం పెంచాలని నిర్ణయించారు. తన నివాసంలో టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలతో కేసీఆర్‌ సమావేశమయ్యారు. నియోజకవర్గాల వారీగా ప్రచార సభలపై ఈ సందర్భంగా చర్చించారు. ఈ నెల 19న ఖమ్మం, పాలకుర్తిలలో 20న సిద్దిపేట, హుజురాబాద్‌, సిరిసిల్ల, ఎల్లారెడ్డిలలో బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు షెడ్యూలు విడుదల చేశారు. ఖమ్మం, పాలకుర్తి సభల ఏర్పాట్లు విషయమై ఖమ్మం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అభ్యర్థి పువ్వాడ అజయ్‌ కుమార్‌, పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఉప ముఖ్యమంత్రి కడియంలతో ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడారు.