పంతం నెగ్గించుకున్న పొన్నాల

పంతం నెగ్గించుకున్న పొన్నాల

17-11-2018

పంతం నెగ్గించుకున్న పొన్నాల

ఎట్టకేలకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తన పంతాన్ని నెగ్గించుకున్నారు. ఎట్టకేలకు కాంగ్రెస్‌ మూడో జాబితాలో తన పేరును దక్కించుకున్నారు. మొన్నటి వరకు జనగామ నుంచి కోదండరాం(టీజేఎస్‌) పోటీ చేస్తారని భావించినప్పటికీ, పొన్నాల ఢిల్లీలో భారీ స్థాయిలో లాబీయింగ్‌ జరిపి.. జనగామ స్థానాన్నే తనకే దక్కేలా పావులు కదిపారు. రాహుల్‌ గాంధీతో ప్రత్యేకంగా సమావేశమైన పొన్నాల ఇక్కడి పరిస్థితులను వివరించి తనకే టికెట్‌ ఇవ్వాలని కోరారు. మొత్తానికి జనగామ సీటు పొన్నాలకే వరించింది. అయితే ఇప్పుడు కోదండరాం ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనేది తెలియాల్సి ఉంది.