ఎన్నికల్లో విజయం కోసం కూటమి వ్యూహాలు - ఎత్తుకు పైఎత్తులు

ఎన్నికల్లో విజయం కోసం కూటమి వ్యూహాలు - ఎత్తుకు పైఎత్తులు

20-11-2018

ఎన్నికల్లో విజయం కోసం కూటమి వ్యూహాలు - ఎత్తుకు పైఎత్తులు

తెరాస సర్కార్‌ను గద్దె దించాలన్న ఏకైక లక్ష్యంతో నాలుగు పార్టీలు గట్టిగా కలిసి జట్టుకట్టడమే మహాకూటమికి పెద్ద అనుకూల అంశంగా భావిస్తున్నారు. ఈ కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో తాము ఇస్తున్న హామీలు గెలిపిస్తాయన్న దీమాతో ఉంది. కూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు అంతా ఒక కొలిక్కి రాకపోవడం.. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిత్వాల ఖరారులో నిమిత్తం లేకుండా సుమారు 40 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఇప్పటికే ప్రచారంలో దిగిపోవడం విజయానికి దోహదంగా ఆ పార్టీ భావిస్తోంది. కూటమికి కలిసొస్తున్న మరో అంశం క్షేత్రస్థాయిలో బలమైన అభ్యర్థులను ఎంపిక చేయడమని ఆ పార్టీ విశ్వాసంతో ఉంది. అయితే, కూటమి భాగస్వామ్య పార్టీలు, నేతల మధ్య సమన్వయ లోపం ప్రతికూల అంశంగా భావిస్తున్నారు. దీనివల్ల ప్రత్యర్థి పార్టీ తెరాస బలపడే అవకాశాలున్నాయని అంచనా వేస్తోంది.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన వైఫల్యాలతో పాటు నాయకుల లేమి పార్టీకి ఇబ్బందిగా పరిణమించింది. అభివ ద్ధి అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి మరింత ఉధ తంగా ప్రచారం నిర్వహించేందుకు భాగస్వామ్యపక్షాలు ప్రణాళికలు రూపొందించే పనిలో నిమగ్నమయ్యాయి. వీటితో పాటు తెలంగాణ ఇచ్చిన రాష్ట్రంగా కాంగ్రెస్‌ పార్టీకి ప్రజల్లో ఉన్న అభిమానం ఈ ఎన్నికల్లో తమకు కలిసొస్తుందని ఆ పార్టీ అంచనా వేస్తోంది. ప్రజల్లో తమ పార్టీకి వున్న అభిమానాన్ని ఓట్లుగా మలుచుకోవడం కోసమే పార్టీ పూర్వ అధ్యక్షురాలు, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీతో విస్తత ప్రచారం చేయించేందుకు ఆ పార్టీ వ్యూహం రచించింది. యువనేత రాహుల్‌గాంధీని రప్పించి పది బహిరంగ సభల్లో ప్రచారం నిర్వహించేందుకు సమాయత్తమైంది.

తొలివిడత ఆదిలాబాద్‌ జిల్లా ముథోడ్‌, నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డి, హైదరాబాద్‌ పాతబస్తీలో రాహుల్‌గాంధీ ప్రచారం నిర్వహించారు. మిగిలిన ఏడు సభల్లో రాహుల్‌తో ప్రచారం నిర్వహించేందుకు తేదీలు ఇప్పటికే ఖరారయ్యాయి. ఈ నెల చివరిన రెండ్రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, హైదరాబాద్‌ జిల్లాల్లో ఎన్నికల ప్రచా రాన్ని నిర్వహిస్తారు. ఈ నెల 23న సోనియాగాంధీ మేడ్చల్‌ నియోజకవర్గం పరిధిలో ప్రచారానికి వస్తున్నారు. తెదేపా అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు, రాహుల్‌తో కలిసి జంటనగరాలతో పాటు శివారుల్లోని 24 నియోజకవర్గాల్లో రోడ్‌షోలు నిర్వహించేందుకు కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీతో పాటు నెలకు మూడు వేల నిరుద్యోగ భ తి, నెలకు రెండువేల పెన్షన్లు, ఎస్సీ, ఎస్టీలకు ఉచిత రేషన్‌, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు, చౌక ధరల దుకాణం ద్వారా కుటుంబంలో ప్రతి సభ్యుడికి నెలకు ఏడు కిలోల సన్నబియ్యం, విద్యార్థులకు బోధనా ఫీజు చెల్లింపులు వంటి అంశాలు తమకు కలిసొస్తాయని, సోనియా, రాహుల్‌గాంధీ సభలతో ప్రజలను తమవైపుకు తిప్పుకోగలమనే ధీమాతో కాంగ్రెస్‌ పార్టీ ఉంది. ఈ ప్రచారానికి మరింత ఊపు తెచ్చేలా జాతీయస్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతలను రంగంలోకి దింపాలని కూడా పార్టీ అధినాయకత్వం యోచిస్తోంది.