టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ కీలకనేత

టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ కీలకనేత

20-11-2018

టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ కీలకనేత

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పేసిన సంగతి తెలిసిందే. టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో ముత్యంరెడ్డి టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నారు. ఆయనకు టికెట్‌ దక్కకపోవడంతో ఇటీవల కన్నీటీ పర్యంతమయ్యారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక టికెట్‌ను కూటమిలో భాగంగా టీజెఎస్‌కు కేటాయించారు. దీంతో ఆయన తీవ్రంగా కలత చెందారు. తొమ్మిదేండ్ల పాటు కాంగ్రెస్‌ పార్టీకి సేవచేసినా గుర్తింపు ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముత్యంరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌తో తనకు పదేండ్ల ఆత్మీయ అనుబంధం ఉన్నదని అన్నారు. ఎప్పుడు కలిసినా ముత్తన్న అని అత్మీయంగా పలుకరిస్తారని తెలిపారు.